కీళ్ల వాతం చాలా మందిని బాగా వేదిస్తున్న సమస్య.ఇక అది ఎందుకొస్తుందో తెలియదు కానీ అది పెట్టే బాధ మామూలుగా ఉండదు. ఉదయం లేవగానే కీళ్లన్నీ పట్టేస్తాయి. కూర్చోవడం, లేవడం కష్టంగా ఉంటుంది. రుమటైడ్‌ ఆర్థరైటీస్‌ జబ్బు కాదు..లక్షణంగా ఉంటుంది. కీళ్ల దగ్గర నొప్పి, వాపు విపరీతంగా ఉంటుంది. కదలిక తగ్గిపోతుంది. శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం ఉంటుంది. ఇది చిన్న కీళ్లలో మొదలై.. ఆ తర్వాత పెద్ద కీళ్లపై తన ప్రతాపం చూపుతుంది.ఈ జబ్బుకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. రక్త పరీక్ష చేసినపుడే బయట పడుతుంది. డెంగీ వ్యాధిలో ప్లేట్‌లెట్స్‌ పడిపోయినట్టుగానే ఇందులోనూ పడిపోతాయి. తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి. కొన్నిసార్లు చాలా ఎక్కువగా తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. తరచుగా గర్భస్రావం అయిన వారికి కూడా రుమటైటీడ్‌ రావొచ్చు. ప్రతీ నలుగురు మహిళల్లో ఒకరికి కీళ్లవాతం వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.


పెయిన్‌ కిల్లర్లు, స్టెరాయిడ్స్‌ ప్రస్తుతం వీటికి చికిత్సగా ఇస్తుంటారు. స్టెరాయిడ్స్‌ అనేవి ఇతర శరీర భాగాలకు సమస్యగా మారకుండా ఉండేలా తక్కువగా ఇస్తారు.తొలి దశలో రుమాటైటీడ్‌ను గుర్తించినపుడు రెండేళ్లపాటు చికిత్స అందిస్తే ఆ తర్వాత స్టెరాయిడ్స్‌ తగ్గించవచ్చు. ఈ చికిత్స ప్రక్రియతో కీళ్లవాతం తగ్గిపోనుంది. ఒకసారి జబ్బు వస్తే దీర్ఘకాలంగా మందులను వాడాలనే అపోహ ఉంది. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చు. చికిత్సతో పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి.కీళ్ళ వాతం వచ్చినప్పుడు కదలడమే కాదు..ఏ పని చేయాలన్నా కీళ్లు తేలుకుట్టినట్టు మంటగా ఉంటాయి. కాలు కదిపినా కన్నీళ్లు వస్తాయి. చాలా కాలంగా సరయిన మందులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ కీళ్లవాతం రోగులకు ఆధునిక వైద్యం కాస్త ఉపశమనం కల్పిస్తోంది. వీటికి తోడూ వ్యాయామం చేయడం ఉత్తమం అట.రోజు వ్యాయామం చెయ్యడం వలన కీళ్ళ వాతం సమస్య కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రోజు ఒక గంట వ్యాయామం చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: