ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ శారీర శ్రమ చేస్తూనే ఉంటారు. బయట ఉద్యోగాలు చేస్తూ కొందరు కష్టపడుతూ ఉంటే,ఇంకొంతమంది గృహిణిలుగా ఉంటూ ఇంటి చాకిరీతో కష్టపడుతుంటారు.కానీ కొంతమందికి ఉదయాన్నే నిద్ర లేవాలి అనిపించకపోవడం, లేదా ఒక వేల నిద్ర లేచిన నీరసంంగా అనిపిస్తూ వుంటుంది.దీనికి కారణం సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడమే. కావున ప్రతి ఒక్కరూ అల్పాహారాన్ని మాత్రం మానకూడదు. కావున మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేర్పుల వల్ల, ఉదయాన్నే కలిగే నీరసాన్ని తగ్గించుకోవచ్చు.అలాగే రోజంతా ఎనర్జీ గా,యాక్టివ్ గా ఉండవచ్చు.అవేంటో ఇప్పుడు చూద్దాం.

 ఉదయమే అల్పాహారంలో రాత్రంతా నానబెట్టిన నాలుగు ఖర్జూరాలను, మెత్తగా నీటితో సహా గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల, తక్షణ శక్తి వచ్చి రోజంతా శక్తివంతంగా  వుంటూ పనిపై ద్యాస ఉంచుతారు. ఇందులో తక్కువ కొవ్వు శాతం వుంది మన శరీరానికి కావలసిన క్యాలరీలను అందిస్తుంది.

 ఉదయాన్నే కాఫీ టీ బదులుగా, రాగి పిండితో చేసిన జావను తాగడం వల్ల,కావాల్సిన శక్తి వచ్చి నీరసం తగ్గుతాయి. ఇందులో వున్న క్యాలిషియం, ఐరన్ విటమిన్ కె,ఏ వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అంతే కాక రక్తహీనత వల్ల కూడా నీరసంగా తయారవుతారు కాబట్టి, ఇందులో వున్న ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు రాగి జావా మేలైనా ఆహారం అని చెప్పవచ్చు. అంతే కాక రాగి పిండితో తయారుచేసే రాగిరోటి, అంబలి, సంగటి  వంటి వాటిని తీసుకోవడం వల్ల ఎనర్జీగా ఉండడమే కాక రోగ నిరోధక శక్తి పెరిగి, బలంగా తయారవుతారు.

ఉదయం బ్రేక్ పాస్ట్ చేసిన 2గంటల తర్వాత పాలకూర, క్యారెట్, బిట్ రూట్ వేసిన జ్యూస్ త్రాగడం వల్ల,ఎనర్జీ బుస్టర్ గా పని చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ,సి, క్యాలిషియం, ఐరన్, మెగ్నీషియం వంటి శరీరానికి పుష్కళంగా అంది శరీరం దృఢంగా మారుతుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లు అధికంగా ఉండి, శరీరాన్ని అనేక రోగాల భారీ నుండి కాపాడుతుంది. ఇది క్యాన్సర్ కలిగించే ప్రీ రేడికల్స్ తో పోరాడి క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. కొంతమంది స్త్రీలు ఋతుక్రమణ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికీ ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వృద్యాప్యం లో క్యాలిషియం తక్కువ అవుతుంటుంది. అలాంటి వారికి ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల క్యాల్షియం పుష్కళంగా అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: