పొలాల్లో పని చేసే వారికి పాము, తేలు వంటి వాటి వల్ల ప్రమాదం చాలా ఉంటుంది. అవి కరిచిన చోట విషం శరీరం అంతటా వ్యాపించి అక్కడికక్కడే మృతి చెందుతూ ఉంటారు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఈశ్వరి అనే మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పొలాల్లో బాగా పెరుగుతుంది కూడా. ఏమంటే దీనిని జాగ్రత్తగా గుర్తించి వాడుకోవాలి. ఆయుర్వేదంలో ఎన్నో  రోగాలకు చికిత్సలు ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఈశ్వరి మొక్క ఒకటి. ఈశ్వరి మొక్క ఎలా విషానికి విరుగుడుగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..

పాము  కరిచినప్పుడు..
పాము కరిచినప్పుడు ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి ఈ మొక్కను వాడాలి. దీని వేరుని తీసుకుని బాగా అరగదీసి ఆ మిశ్రమాన్ని పాము కాటు వేసిన ప్రదేశంలో లేపనంగా వేయాలి. ఆ లేపనం నల్లగా మారని వెంటనే తీసివేయాలి. ఆ లేపనం వేస్తూనే ఉండాలి. లేపనం ఎప్పుడైతే నల్లగా మారదో అప్పుడు శరీరంలో విషము లేనట్టు. మరియు ఒక రెండు గ్రాముల ఈశ్వరి మొక్క కాండం భాగాన్ని మిశ్రమంగా చేసి పరిచిన వ్యక్తి చేత మింగించాలి. ఇలా చేస్తే తొందరగా విషానికి విరుగుడు దొరుకుతుంది. అదే తేలు వంటి ఇతర విష పురుగులు కుట్టినప్పుడు ఒక్కసారి లేపనంగా వేస్తే చాలు విషయానికి విరుగుడు వస్తుంది.ఆ తర్వాత వైద్యుని సంప్రదించవచ్చు. అయితే ఇది గర్భిణీస్త్రీలు వాడకూడదు. ఒకవేళ వాడితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చెట్టును పొలాల్లో నాటడం వల్ల ఆ వాసనకి పాములు కూడా దరి చేరవు.

అంతేకాక ఇది కీళ్ల నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు, దీని వేరును బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక రెండు గ్రాములు తీసుకొని ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయంలో తయారుచేసుకోవాలి.దానికి తేనెను కలిపి ఒక వారం రోజులు పాటు సేవిస్తే ఎటువంటి నొప్పులైనా ఇట్టే ఉపశమనం కలుగుతుంది.

 అధిక రక్తపోటు..
 అధిక రక్తపోటుతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారు నల్ల ఈశ్వరిమొక్క వేరును తీసుకొని, బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత దాన్ని పొడిగా చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. దీనిని రోజు రెండు లేదా మూడు చిటికెల మోతాదులో  ఒక గ్లాసు నీటితో కలిపి, భోజనానికి అర గంట ముందు సేవిస్తూ ఉండాలి. ఇలా సేవిస్తూ ఉంటే అధిక రక్తపోటు తగ్గి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: