అశ్వగంధకు ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేకస్థానం ఉంది.ఇది ఆందోళన తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది.దీనికోసం అరస్ఫూన్ అశ్వగంధ పొడిని, గ్లాస్ పాలలో వేసుకొని, తేనే కలుపుకుని తాగడంవల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే బ్రాహ్మి కూడా బాగా సహాయపడుతుంది.ఇది ఒత్తిడి కలిగించే హార్మోనును బ్యాలెన్స్ చేస్తుంది. మెదడకు ఉత్తేజపరుస్తుంది .పిల్లలకు ఏకాగ్రత పెరగాలి అంటే బ్రాహ్మి. చాలా బాగా పనిచేస్తుంది.ఉసిరి, మండూక పర్ణి, యష్టి మధు, జటామంసి వంటి మూలికలు కూడా ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ ఆయుర్వేద చికిత్సల వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తొలిగిపోతాయి.
యాంగ్జయిటీతో ఇబ్బందిపడేవారు తలకు అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకుంటువుండాలి.లేనిపోని ఆలోచనలు రాకుండా యోగ ధ్యానం వంటివి చేయాలి.దీనితో పాటు ఆయుర్వేదం మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది.
ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆందోళన తగ్గుతుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు మసాలా ఆహారం తీసుకోకూడదు. పండ్లు, కూరగాయలు,ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటువుండాలి. అన్ని వంటల్లోను ఉప్పు,కారం తగ్గించాలి. ఇవి ఎక్కువయినా ఒత్తిడి లక్షణాలు ఇంకా పెరుగుతాయి. ఆయుర్వేదం చికిత్స వల్ల మనసు, శరీరం రెండింటికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.