1).ఉప్పు, చక్కెర
ఉప్పు (సోడియం), చక్కర కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న కాల్షియంను మూత్రం రూపంలో బయటికి విసర్జింపబడెలా చేస్తాయి.ఎముకలో కాల్షియం తక్కువగా ఉంటే అవి గుల్లగా, పెళుసుగా మారి, చిన్న దెబ్బ తగిలిన తొందరగా విరిగిపోతాయి. అదేవిధంగా, డీప్-ఫ్రైడ్ స్నాక్స్, ప్రాసెస్డ్ ఫూడ్ ఎక్కువగా తీసుకుంటే ఎముక ఆరోగ్యం దెబ్బతింటుంది.
2). కెఫిన్ వల్ల..
కాఫీ,టీ లలో ఉన్న కెఫెన్ మరియు ఆల్కహాల్ క్యాల్షియంను దెబ్బతీస్తుంది.ఆల్కహాల్ వల్ల జీర్ణశయం ఆహారంలోని కాల్షియంను,మినరల్స్, పోషకాలు గ్రహించలేదు. కూల్ డ్రింక్స్, కాఫీ, టీ లు ఎక్కువగా తాగినా ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో వున్న కార్బోనేటేడ్ క్యాలషియంను గట్టిపడేలా చేస్తాయి.
3). తక్కువ కాలరీలు ఉన్న ఆహారం..
ఈమధ్య అందరూ జీరో సైజ్ అవ్వాలని తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల శరీరాన్ని కావాల్సిన శక్తి అందదు. శరీరం మెటబాలిజం దెబ్బతింటుంది. శరీర కండరాలు, ఎముకలు బలహీనపడతాయి.
అందువల్ల ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా, ఇంట్లో తయారు చేసుకుని ఆహారపదార్థాలను, కొవ్వు లేని పాల పదార్థాలను వాడడం వల్ల, శరీర ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా ఎముకలు కావలసిన కాల్షియం కూడా పుష్కలంగా అందుతుంది. ఎముకల ఆరోగ్యం కోసం, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పాలు,గుడ్లు మొదలైనవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.