ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా జుట్టు మీద చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. జుట్టు రాలడం వంటివి జరుగుతుంటే అందుకు తగ్గట్టుగా పరిహారాన్ని కూడ చేస్తున్నారు..ముఖ్యంగా అలాంటి సమయాలలో మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా.. జుట్టు రాలకుండా ఉండేందుకు సరైన షాంపూలను వాడుతూ ఉంటాము. అయితే ఇలా షాంపులను సక్రమంగా వాడడం చాలామందికి పూర్తిగా అప్లై చేసే విధానం తెలియకపోవచ్చు. కొంతమంది షాంపూని నేరుగా జుట్టు పైన అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తే దానికంటె.. కాస్త గోరువెచ్చని నీటిలో షాంపూను కలుపుకొని ఆ తర్వాత జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు సురక్షితంగా ఉండడంతో పాటు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.


జుట్టుని అలా స్నానం చేసిన తర్వాత కచ్చితంగా కండిషనర్ వాడాలి.అయితే హెయిర్ రూట్స్ కు కండిషనర్ అప్లై చేయకూడదు.. ఇలా జుట్టుకు కండిషనర్ అప్లై చేసిన తర్వాత 2 నిమిషాలకు జుట్టుని శుభ్రంగా కడగాలి. ప్రతిరోజు షాంపూతో అసలు స్నానం చేయకూడదట. ఒకవేళ ఇలా చేయాలనుకునేవారు రాత్రి సమయాలలో జుట్టుకి నూనె రాసుకుని ఉదయాన్నే లేచి తలస్నానం చేయవచ్చు. జుట్టుకు డైరెక్ట్ గా షాంపూ ని అప్లై చేయడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.ఇది జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది అందుచేతనే అవసరాలు కనుగుణంగానే మాత్రమే షాంపూను ఎంచుకోవాలి.


సల్ఫేట్ లేని షాంపూలను ఉపయోగించడం మంచిది. ఈ షాంపూలో కెమికల్ ఫ్రీగా ఉండడమే కాకుండా జుట్టుని మృదువుగా కూడా ఉంచుతాయి. ముఖ్యంగా ఆయుర్వేద షాంపులలో హానికరమైన రసాయనాలు చాలా తక్కువగా ఉంటాయి దీనివల్ల జుట్టు మూలలకు నష్టం తగ్గుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. షాంపూతో స్నానం చేసిన వెంటనే జుట్టును ఆరబెట్టుకోవడానికి డ్రైయర్ ని అసలు ఉపయోగించకూడదు. జుట్టు పొడిగా ఉంచడం వల్ల ఎల్లప్పుడూ జుట్టుకి చాలా మంచిది. జుట్టు త్వరగా ఆరబెట్టడానికి డ్రైయర్ను హీట్ మోడ్ లో ఉంచడం వల్ల జుట్టు చాలా దెబ్బతినేలా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: