నోటిపూతతో చాలా మంది కూడా బాధ పడతారు.దీన్ని తగ్గించుకోడానికి మీరు టాబ్లెట్స్‌ వాడితే , వెంటనే వాటిని విడిచిపెట్టండి. మన ఇంట్లో ఉండే పదార్ధాలతో మాత్రమే నోట్లో పొక్కులు ఈజీగా నయం అవుతాయి.నోటి పూతలకి తేనెను వాడటం చాలా బాగా పనిచేస్తుంది.అలాగే మీరు పసుపు పొడి, వేడి నీటిని కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. ముందుగా తేనెను కూడా ఉపయోగించండి..ఈ సమస్య తేనెతో చాలా ఈజీగా నయమవుతుంది. తేనె ఎన్నో ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. మీరు మీ పొక్కుపై కొంత సేపు పాటు ఈ తేనెను ఉంచితే దాని నుండి ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనం పొందుతారు.చాలా మందికి కూడా చీటికి మాటికి ఉమ్మి వేసే అలవాటు ఉంటుంది. అయితే అది మంచి పద్ధతి కాదు.అలా ఉమ్మివేయకూడదని మీరు గుర్తుంచుకోవాలి.గోరువెచ్చని నీటితో కూడా నోటి బొబ్బలు చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇక ఇందుకోసం గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకుని మీరు బాగా పుక్కిలించాలి.


ఇలా పుక్కిలించిన తర్వాత మామూలు నీటితో నోటిని బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా చెయ్యడం వల్ల మీ నోటిలో ఉప్పు రుచి ఉండదు.నోటిపూత నుండి చాలా త్వరగా ఉపశమనం పొందుతారు.పసుపులో చాలా ఔషధ గుణాలున్నాయి. దీన్ని చాలా వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. బొబ్బలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. అటువంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో పసుపు చాలా బాగా పని చేస్తుంది. మీరు పసుపు పొడిని వాడితే నోటి పూతల వాపు నుంచి ఉపశమనం పొందుతారు. కొద్ది రోజుల్లోనే మీకు ఫలితం ఉంటుంది. ఇక ఇందుకు మీరు ఒక గిన్నెలో కొంత పసుపు పొడిని తీసుకుని కొంచెం నీరు కలపాలి. ఇలా ఒక మందపాటి పేస్ట్‌గా సిద్ధం చేయండి. ఈ పేస్ట్‌ను రోజుకు రెండుసార్లు మీకు వచ్చిన నోటి బొబ్బలపై రాయండి. ఇలా చేస్తే అల్సర్ల నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందుతారు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. నోటి పూత సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: