ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఫూడ్ తీసుకోవాలన్న బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తీసుకుంటూ ఉంటారు.అలాంటివారు ఆరెంజ్ జ్యూస్ త్రాగడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆరెంజ్ జ్యూస్ ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు రోజుకు రెండుగ్లాస్ ల చొప్పున ఇవ్వడం ద్వారా,వారికి కావాల్సిన క్యాల్సియం పుష్కళంగా అందుతుంది. ఈ సమయంలో కలిగే నీరసం, నిస్సత్తువను దూరం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడానికి..
ఆరెంజ్ జ్యూస్ లో నీటిలో కరిగే విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తరుచూ తీసుకోవడం వల్ల,తల్లి బిడ్డలకు కావాల్సిన రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అలాగే శిశువు  మెదడు పెరగడానికి కావాల్సిన జింక్, విటమిన్ b6, ఫోలిక్ యాసిడ్,ఐరన్ పుష్కళంగా అందుతుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది..
గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో అరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి ఆరెంజ్ జ్యూస్ ఇవ్వడం వల్ల, ఇందులో వున్న అధిక గ్లూకోజ్ మరియు పైబర్లు తిన్న ఆహారాన్ని తొందరగా జీర్ణం అవ్వడానికి సహాయపడతాయి. దీని మూలానా గ్యాస్, మలబద్ధకం వంటివి దరిచేరవు.

బీపీ తగ్గించుకోవడానికి..
ఆరెంజ్ జ్యూస్ లో వున్న పోటాషియం గర్భిణీ మహిళలో కలిగే అధిక బీపీని కంట్రోల్ ఉంచుతుంది.

మూత్రపిండాల ఆరోగ్యంకోసం..
యురోజెనిటల్ వ్యవస్థపై భారం పెరగడంతో, గర్భిణీ స్త్రీ కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతుంది. గర్భధారణ సమయంలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి శరీరం నుండి ఏదైనా విషాన్ని ఫిల్టర్ చేస్తాయి. నారింజలు మూత్రాశయం మరియు మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి.


గుండెఆరోగ్యం మెరుగుపర్చడానికి..
గర్భధారణ సమయంలో గుండె మరియు శ్వాసకోశ వ్యవస్థపై భారం పెరుగుతుంది. దీనిని తగ్గించడానికి నారింజలోని పొటాషియం అద్భుతంగా పనిచేస్తుంది.


మరియు ఇది రక్త నాళాలను పునర్నిర్మించి వాటిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడే కీలకమైన ఖనిజాలను అందిస్తుంది.

చర్మ సమస్యలు తగ్గించడానికి..
నారింజలు చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.మరియు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి, తద్వారా మొటిమలను, మచ్చలను తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: