![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/vamu-uses2a668f0d-cade-4196-bb2c-ff96ade9214d-415x250.jpg)
వాము ప్రేగుల్లో ఏర్పడే బ్యాక్టీరియాను నివారించి, ప్రేగు నొప్పి సమస్యలను నివారిస్తుంది. కాలేయం మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.తరచుగా వామును నమలడం ద్వారా నోటి దుర్వాసన మరియు దంత క్షయ సమస్యలను తగ్గించుకోవచ్చు. వాము గింజల్లో పంటి నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయని నిరూపించబడింది. వాతావరణంలో మార్పుల ఫలితంగా చాలామందికి జలుబు చేస్తూ ఉంటుంది. అలాంటివారు ఒక స్పూన్ వామును తీసుకుని దానిని బాగా నలిపి ఒక పల్చని గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉంటే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.
వాములో విరేచనాలు మరియు అతిసారం నయం చేసే గుణాలు సహజంగానే ఉన్నాయి. అందువల్ల అజీర్ణం మరియు డయారియాతో బాధపడేవారు రోజుకు రెండు పూటలా వాముని నమిలి తిన్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. వాము శరీరంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తరచుగా వచ్చే జ్వరాలను నివారిస్తుంది. రాత్రి పడుకునే ముందు వాము మరియు రాత్రి ఉప్పును కలిపి నమలడం వలన ఫైల్స్ ఫలితంగా వచ్చే రక్తస్రావాన్ని అరికట్టవచ్చు. ఇకపోతే కడుపునొప్పి వచ్చేవారికి వాము చాలా చక్కగా పనిచేస్తుంది.వీటితోపాటు మరెన్నో అనారోగ్య సమస్యలను వాము ద్వారా నయం చేసుకోవచ్చు. అందుకే వాము తినడానికి ప్రయత్నం చేయండి.