చాలామంది పెళ్లయి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ,పిల్లలు లేక సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. దీనికి ఆడవారిలో సరైన అండాలు విడుదల అవ్వకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.ఇలాంటి వారికి సంతానం కొన్ని సంవత్సరాలైనా కలగక ఇంట, బయట అడిగే ప్రశ్నలకు ఒత్తిడికి గురవుతూంటారు.స్త్రీ లలో అండాలు సరిగ్గా విడుదల అవ్వడానికి, రకరకాల ట్రీట్మెంట్లు మరియు మందులను వాడుతూంటారు. కానీ నాచురల్ గా సరైనా అండోత్పత్తికి, సరైనా డైట్ ఫాలో అవ్వాలని,ఆహార నిపుణులు సూచిస్తూన్నారు. అలాంటి డైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ..

టిఫిన్ కీ బదులుగా..
సాధారణంగా  ఇడ్లీ,దోశ ఉప్మా వంటి వాటిని టిఫిన్ రూపంలో తీసుకోవడం వల్ల, ఇందులోని అధిక కార్బోహైడ్రేట్స్,అధికబరువు పెరిగేలా చేయడమే కాక, హార్మోన్ల బ్యాలెన్స్ తప్పేలా చేసి, సరైన అండం విడుదలకు అడ్డుపడతాయి. ఇటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా,రోజూ ఉదయం తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ ని జ్యూస్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. ఇందులోని ఫైబర్స్ అధికబరువును తగ్గించి, సరైన అండోత్పత్తికి దోహదం చేస్తాయి. జ్యూస్ తాగిన గంట కానీ రెండు గంటల తర్వాత కానీ మొలకెత్తిన గింజలు తీసుకొని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకొని  తినడం అలవాటు చేసుకోవాలి. ఈ సలాడ్ వల్ల రక్త సరఫరా మెరుగుపడడమే కాకుండా, హార్మోన్స్ సక్రమంగా విడుదల చేసేలా శరీరాన్ని తయారు చేస్తుంది.

మధ్యాహ్నం భోజనం..
మధ్యాహ్న భోజనంలో రెండు పుల్కాలు మరియు కూరగాయలతో ఒక కూర తగిన మోతాదులో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

సాయంత్రం..
సాయంత్రం టీ, కాఫీలు బదులుగా ఏదైనా బొప్పాయిజ్యూస్, ఆపిల్ జ్యూస్, పుచ్చకాయజ్యూస్ వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల, ఇందులోని న్యూట్రియన్స్ సరైన సంఖ్యలో, సరైన ఆండోత్పత్తికి ఉపయోగపడతాయి. వీటితో పాటు జింక్ అధికంగా వున్న నానబెట్టిన పుచ్చ గింజలను కానీ, గుమ్మడి గింజలను తీసుకోవాలి.ఇలాంటి డైట్ ఫాలో అవ్వడం వల్ల అండం క్వాలిటీగా, అధిక సంఖ్యలో ఊత్పత్తి అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: