ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఆహారం బియ్యం మాత్రమే... దీనిని రకరకాలు మనం నచ్చినట్టుగా వండుకోవచ్చు. సాధారణంగా చాలామంది అన్నం వండేటప్పుడు బియ్యం లో కాస్త ఎక్కువగా నీళ్లు పోసి గంజిని వారుస్తూ ఉంటారు. కానీ అలా బియ్యం ఉడికిన తర్వాత ఆ నీటిని వార్చడం తప్పు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎందుకంటే వండిన అన్నం గంజి వార్చేస్తే చాలా రకాల పోషకాలు ఆ గంజి ద్వారానే బయటకు వెళ్లిపోతాయట. ముఖ్యంగా పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు అంటే.. గంజి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

గంజి తాగడం వల్ల మన శరీరానికి విటమిన్ సి , విటమిన్ ఈ, విటమిన్ బి తో పాటు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటివల్ల మన ఆరోగ్యానికి ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది అంటే శరీరానికి కావలసిన త్వరితశక్తి లభిస్తుంది.  ఫలితంగా అలసట,  నీరసం , నిస్సత్తువ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. గంజి మన చర్మానికి చాలా చక్కటి మేలు చేస్తుంది.  ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు అతినీలలోహిత కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడే శక్తి గంజికి ఉంది . అంతేకాదు అన్నంలో నుంచి వచ్చిన గంజి నీటిని ముఖానికి పట్టించడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల్లో కూడా జుట్టు నెరవడం,  జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి గంజిని తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తేలికపాటి షాంపూ,  కండిషనర్ తో జుట్టును కడగడం వల్ల జుట్టు రాలిపోయే సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాదు వండిన అన్నం గంజిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి.  కాబట్టి ముఖంలోని బ్లాక్ హెడ్స్,  వైట్ హెడ్స్ కూడా తొలగిపోవడానికి సహాయపడుతుంది.. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి .. జీర్ణక్రియ పనితీరు పెంచడానికి.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను తగ్గించడానికి కూడా గంజి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: