టీ లేదా కాఫీ తాగక ముందు నీళ్లు తాగిన పర్లేదు కానీ అవి తాగిన తర్వాత మాత్రం నీళ్లు తాగక కూడదట. వేడి వేడి టీ తాగిన తర్వాత వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో మార్పులు వస్తాయని. దాని వల్ల అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అంతేకాదు టీ, కాఫీ తాగిన వెంటనే వాటర్ తాగడం వల్ల దంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా టీ, కాఫీ తాగిన తర్వాత వాటర్ తాగితే కడుపులో అల్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట.
ఇదే కాకుండా గొంతు నొప్పి కూడా వస్తుందని అంటున్నారు. టీ, కాఫీ తాగే ఒక అర గంట ముందు నీళ్లు తాగి టీ తాగిన గంట తర్వాత వాటర్ తాగొచ్చని అంటున్నారు. సో ఎలా చూసినా సరే టీ, కాఫీతో పాటుగా నీళ్లు అసలు తాగకూడదని తెలుస్తుంది. రిఫ్రెష్ కోసం తాగే టీ వల్ల ఎంతోకొంత లాభాలు ఉన్నా అది తాగాక వాటర్ తాగడం అనేది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. మరి మీకు టీ తాగే అలవాటు ఉంటే వాటర్ విషయంలో కాస్త టైం తీసుకుంటే బెటర్.