పారాసిటమాల్: ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే?

మనకు జ్వరం… ఒళ్లునొప్పులు… అనేవి చాలా సర్వసాధారణం. అందుకు వెంటనే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం.అందుకే చాలా ఇళ్లలో కూడా పోపుల పెట్టేలో వస్తువులా పారాసిటమాల్ టాబ్లెట్లు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ కరోనా కాలంలో మెడికల్ షాపుల్లో రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిన టాబ్లెట్ ఈ పారాసిటమాల్.కానీ ఇప్పుడు ఇదే పారాసెటమల్ ని డేంజర్ అంటున్నాయి పరిశోధనలు. ఈమధ్య కాలంలో ఆకస్మికంగా ఆగిపోతున్న గుండెకు ఈ టాబ్లెట్ల వాడకం కూడా ప్రధాన కారణమనే వాదనకు ఇప్పుడు బలం చేకూరుతుంది. ఇంతకీ ఈ పారాసిటమాల్‌లో ఏముంది? ఇది ప్రాణాంతకంగా ఎందుకు మారుతోంది…? వంటి విషయాలు తెలుసుకుందాం.ఇక హార్ట్ అటాక్స్ కారణాల్లో బీపీ అనేది చాలా ప్రధానమైంది. ఇలాంటి బీపీ పెరగడానికి సోడియం అంటే ఉప్పు అనేది ప్రధాన కారణం. ఉప్పు ఎక్కువగా తినడం అనేది ఖచ్చితంగా గుండె, ఇతర ప్రసరణ వ్యవస్థలకు ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. 


ఉప్పులో సోడియం అనేది మిళితం అయి ఉంటుంది. ఇక అలాంటి సోడియం నిల్వలను ఈ పారాసిటమాల్ టాబ్లెట్స్ పెంచుతున్నాయట.ప్రతి పారాసిటమాల్ టాబ్లెట్‌లో సోడియం గణనీయమైన మొత్తంలో ఉంటుందట. ఇలాంటి టాబ్లెట్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల సోడియం నిల్వలు పెరిగి హార్ట్ అటాక్స్ ఇంకా అలాగే కార్డియాక్ అరెస్టులకు కారణమవుతుంది హెచ్చరిస్తోంది.ఇలా సోడియం కలిగిన పారాసిటమాల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు పరిశోధకులు. ఇక 60 నుంచి 90 ఏళ్ల మధ్య వయస్సు గల దాదాపు 300,000 మంది వ్యక్తుల నుండి ఈ డేటాను విశ్లేషించారు. రోగులలో సగం మందికి అధిక రక్తపోటు అనేది ఉంది. ఇక పరిశోధకులు ఈ పరిశోధనను వివిధ దశల్లో ఒక సంవత్సరం పాటు కొనసాగించి ఈ డేటాను వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: