శరీరం యవ్వనంగా మార్చడంలోనూ,అందాన్ని రెట్టింపు చేయడంలోనూ,'విటమిన్ ఈ 'చాలా బాగా దోహదపడుతుంది. విటమిన్ ఈ గల ఆహారాలను తీసుకోవడంతో లేలేత బుగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఈ అధికంగా వున్న కలబంద గుజ్జును మొహానికి రాయడం వల్ల,మొటిమలు మచ్చలు తొందరగా తగ్గిపోతాయి. కలబంద గుజ్జును ఆహారంగా తీసుకోవడంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
యాపిల్..
ఆపిల్ ని అధికంగా తినడం వల్ల అందులోని కొల్లాజన్,ఎలాస్టిక్,యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడతాయి. ఆహారంగానే కాక,దీని గుజ్జుతో లేపనాలు వేసుకోవడం వల్ల చర్మం మరింత మెరుగుపడుతుంది
తేనె..
తేనె మనం రాసుకునే లేపనంలో వాడటం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా తయారు చేయడంలో ఉపయోగపడతాయి. తేనెను ఆహారంగాను,ముఖానికి వేసుకునే లేపనాల్లో వాడటం చాలా ఉత్తమం.
ఆలివ్ ఆయిల్..
ఆలివ్ ఆయిల్ ను ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవడం వల్ల, చర్మానికి ఎలాస్టిక్ గుణాలు అందించి,వృద్ధాప్య చాయలు రాకుండా కాపాడుతుంది. బుగ్గలు మృదువుగా తయారవడానికి కూడా చాలా బాగా తోడ్పడుతుంది.
రోజ్ వాటర్..
రోజ్ వాటర్ ను మొహానికి వేసుకుని ప్యాక్ లలో వాడటం వల్ల, బుగ్గులను గులాబీ రేకులు వలే మృదువుగా తయారు చేయడమే కాక, మాయిశ్చరైజింగ్ గా కూడా ఉంచుతుంది.
పాలు..
పాలలో లాక్టైజ్, ప్రోటీన్స్ కలంగా ఉంటాయి.వీటిని చర్మం పై రాసి మసాజ్ చేయనుకోవడంతో బుగ్గలు, పిల్లల బుగ్గలు వలె మెరుపును సంతరించుకుంటాయి.