పొట్టపై గల స్ట్రెచ్ మార్క్‌లను పోగొట్టుకోవడానికి షుగర్ స్క్రబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం ఒక గిన్నెలో 2 స్ఫూన్ల చక్కర, ఒక స్ఫూన్ నీరు వేసి పాకంలా చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మర్క్స్ పై రాసి అరగంటసేపు అరనిచ్చి,మర్దన చేస్తూ,శుభ్రం చేసుకోని మైశ్చరైజర్ రాయాలి.ఇది చర్మం రక్త ప్రసరణను మెరుగు పరచి చర్మం సాగిన గుర్తులను నివారిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న పసుపు కూడా స్ట్రెచ్ మర్క్స్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి ఒక స్ఫూన్ కొబ్బరినూనెలో కొంచెం పసుపు వేసి పేస్ట్‌లా చేసి,స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేయాలి.ఇది బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరి.
ప్రతిరోజూ బాదం నూనెతో స్ట్రెచ్ మార్క్స్ గల పొట్టపై రాయడం వల్ల ఇందులో ఉన్న 'విటమిన్ ఈ 'స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
చర్మం స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి బేకింగ్ సోడా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇందుకోసం ఒక స్ఫూన్ బేకింగ్ సోడాలో ఒక స్ఫూన్ నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని తరుచూ స్ట్రెచ్ మార్క్స్‌పై రాయడం వల్ల,పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టుకోవవచ్చు.
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి కలబందగుజ్జు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనికోసం ఒక స్ఫూన్ బంగాళాదుంప గుజ్జులో,ఒక స్ఫూన్ అలోవెరా జెల్ కలపి,ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ మీద రాసి, బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీంతో చర్మం సహజంగా మెరుపుదనం సంతరించుకుంటుంది.