ఇప్పుడు చెప్పబోయే చిట్కాను వాడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఖచ్చితంగా దూరమవుతాయి. గ్యాస్, ఎసిడిటీ ఇంకా అలాగే మలబద్దకం వంటి సమస్యలు చాలా ఈజీగా దూరమవుతాయి.మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి..దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది అరుచిని ఈజీగా దూరం చేస్తుంది. ఇంకా నాలుకపై ఉండే రుచి గుళికలను ఉత్తేజం చేస్తుంది. అలాగే నిమ్మకాయ శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అలాగే నిమ్మకాయతో పాటు మనం మిరియాల పొడిని, సైంధవ లవణాన్ని, నల్ల ఉప్పును కూడా వాడాల్సి ఉంటుంది. ముందుగా మీరు అర చెక్క నిమ్మకాయను తీసుకుని దానిలో ఉండే గింజలను తీసి వేయాలి. ఆ తరువాత దీనిపై రెండు చిటికెల మిరియాల పొడిని, 2 లేదా 3 చిటికెల సైంధవ లవణాన్ని ఇంకా ఒక చిటికెడు నల్ల ఉప్పును వేయాలి.


ఆ తరువాత ఈ నిమ్మ చెక్కను నేరుగా మంట మీద ఉంచి 2 నుండి 3 నిమిషాల పాటు అలాగే వేడి చేయాలి.ఆ తరువాత దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ నిమ్మకాయ కొద్దిగా చల్లారిన తరువాత దాని నుండి రసాన్ని మీరు పిండాలి. ఇక తరువాత  ఈ నిమ్మ రసాన్ని స్పూన్ తో తీసుకుని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి. తినగలిగిన వారు నేరుగా ఈ నిమ్మ చెక్కను నోట్లో వేసుకుని కూడా చప్పరించవచ్చు. ఇలా నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల రుచి గుళికలనేవి ఉత్తేజితమవుతాయి. మీ నోటికి రుచి తెలుస్తుంది. ఇంకా ఆకలి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు చాలా ఈజీగా దూరమవుతాయి.ఇంకా జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధిస్తున్నప్పుడు నిమ్మకాయను ఈ విధంగా తీసుకోవడం వల్ల నోటికి రుచి తెలియడంతో పాటు మన ఆకలి కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: