అధిక బరువు, అధిక పొట్ట వంటి సమస్యలతో బాధపడే వారు మనకు సులభంగా దొరికే పదార్థాలతో టీ ని తయారు చేసుకుని రోజుకు ఒకసారి తాగడం వల్ల చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు.ఇంకా అంతేకాకుండా ఈ టీ ని తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అధిక బరువును తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టీని తయారు చేసుకోవడానికి  మనం ఒక గ్లాస్ నీటిని, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను, ఒక ఇంచు అల్లం ముక్కను, అర చెక్క నిమ్మరసాన్ని ఇంకా ఒక టీ స్పూన్క తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అల్లాన్ని శుభ్రపరిచి దాన్ని మెత్తగా దంచాలి.ఇంకా అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని మెత్తగా దంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వాటిని వేడి చేయాలి. తరువాత ఇందులోనే అల్లంతో వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా కలపాలి. ఈ నీటిని ఒక 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై అలాగే బాగా మరిగించాలి.


ఆ తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో నిమ్మరసం ఇంకా తేనె వేసి బాగా కలిపి తీసుకోవాలి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం తేనెను ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న టీని రోజూ ఒకసారి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ చాలా సులభంగా తొలగిపోతుంది. ఇంకా అలాగే అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.ఈ టీ ని తాగడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు ఈజీగా తొలగిపోతాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా అధిక బరువుతో బాధపడే వారు అల్లం వెల్లుల్లితో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: