ఆఫ్రికాట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు పుల్లపుల్లగా తియ్య తియ్యగా చాలా రుచిగా ఉంటుంది.అలాగే ఇది మనకు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా ఇది లభిస్తుంది. డ్రై ఆఫ్రికాట్ ను తిన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది. దీనిని నేరుగా తినడంతో పాటు తీపి వంటకాల్లో కూడా వాడతారు. ఆఫ్రికాట్ తో చేసే కుబానికా మీటా అనే తీపి వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. చాలా మంది కూడా దీనిని ఇష్టంగా తింటారు. ఇతర డ్రై ఫ్రూట్స్ వలె ఆఫ్రికాట్ లో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఆఫ్రికాట్ లో ఉండే పోషకాల గురించి అలాగే దీనిని తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.దీనిలో క్యాల్షియం. విటమిన్ ఎ, పొటాషియం, ఐరన్ ఇంకా అలాగే విటమిన్ సి వంటి పోషకాలు చాలా ఉన్నాయి.


ఇక రక్తహీనతతో సమస్యతో బాధపడే వారు రోజూ ఒక డ్రై ఆఫ్రికాట్ ను తింటే వారి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇంకా అలాగే ఆఫ్రికాట్ లో పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల మలబద్దకం సమస్య ఈజీగా నివారించబడుతుంది. ఆఫ్రికాట్ ను తినడం వల్ల ఎముకలు ధృడంగా ఇంకా బలంగా తయారవుతాయి. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో  ఆఫ్రికాట్ మనకు బాగా సహాయపడుతుంది. ఆఫ్రికాట్ ను తినడం వల్ల కంటి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వివిధ రకాల కంటి సమస్యలు అసలు మన దరి చేరకుండా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. బరువు తగ్గడంలో ఇంకా శరీరంలో ఎలక్ట్రోలైట్ ల స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా ఆఫ్రికాట్ మనకు చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: