మనం చాలా సార్లు గమనించే ఉంటాం.కొంతమందికి మందికి  శరీరంలో అధికంగా చేరిన కొవ్వు తిత్తిలా ఏర్పడి కొవ్వు గడ్డలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి.ఇవి శరీరంలో ఏ చోటైనా ఏర్పడవచ్చు. ఇవి చిన్న చిన్న గడ్డలుగా లేదా పెద్ద గడ్డలుగా కూడా ఏర్పడవచ్చు.ఇక ఈ గడ్డలను ఎడిమా అని కూడా అంటారు. అయితే ఇవి నరాలపై ఏర్పడడం వల్ల కొన్ని సార్లు నొప్పి కలిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ కొవ్వు గడ్డల వల్ల ఎలాంటి నష్టం లేనప్పటికి కొన్ని సార్లు ఇవి క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడే ఛాన్స్ ఉంది. అయితే వీటిని తొలగించుకోవడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. కానీ ఒక్క చక్కటి ఆయుర్వేద టిప్ వల్ల మనం చాలా సులభంగా ఈ కొవ్వు గడ్డలను తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ని పాటిస్తే చాలా సులభంగా కొవ్వు గడ్డలు తొలగిపోతాయి.ఇక శరీరం పై వుండే కొవ్వు గడ్డలను తొలగించే చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా ఎలా వాడాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ పాటించడానికి  మనం పచ్చి పసుపును వాడాల్సి ఉంటుంది. ఈ పసుపు మనకు మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతుంది. అయితే ఇది అందుబాటులో లేని వారు ఆయుర్వేద షాపుల్లో లభించే పసుపును కూడా ఉపయోగించుకోవచ్చు.


కానీ వంటల్లో వాడే పసుపును మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. పచ్చి పసుపును ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఇందులో 4 లవంగాలను మెత్తని పొడిగా చేసుకుని వేసుకోవాలి.ఇంకా అలాగే ఒక టీ స్పూన్ ఆవ నూనెను కూడా వేసి బాగా కలపాలి. ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొవ్వు గడ్డలపై రాసి కాటన్ క్లాత్ తో కట్టు కట్టాలి.దీనిని రాత్రంతా కూడా అలాగే ఉంచి ఉదయాన్నే తొలగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేయడం వల్ల చాలా ఈజీగా కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. దీనిలో వాడిన ప్రతి పదార్థంలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి గడ్డలను ఇంకా అలాగే గడ్డల వల్ల కలిగే నొప్పులను, వాపులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. దీనితో పాటు గోరు వెచ్చని ఆవ నూనెను కొవ్వు గడ్డలపై రాసి మసాజ్ చేయడం వల్ల కూడా ఈ కొవ్వు గడ్డలు చాలా ఈజీగా కరిగిపోతాయి. ఇలా ఈ టిప్స్ వాడడం వల్ల చాలా సులభంగా మనం కొవ్వు గడ్డలను కరిగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: