కొంతమంది అదృష్టం కలిసి రావాలని ఎన్నో రకాల మొక్కలను ఇంటి చుట్టూ ఆవరణంలో నాటుతూ ఉంటారు. అలా నాటుతూ ఉన్న వాటిలో కలబంద మొక్క కూడా ఒకటి. అయితే ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే విషయం పై కొంతమంది సందేహం పడుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఇప్పుడు ఈ మొక్కను పెంచుకోవచ్చో లేదో ఒకసారి మనం తెలుసుకుందాం.


కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ప్రయోజకరణంగా ఉంటుంది అందుకే చాలామంది వీటిని సపరేట్గా పెంచుతూ ఉంటారు. ఇలాంటి మొక్కను ఇంటి ఆవరణంలో పెంచుకోవడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కలబంద పిలక నుండి ఎన్నో రకాల మొక్కలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా పొదలు పొదలుగా పోతూ ఉంటాయి..దీనివలన విష జంతువులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి కలబందలో ఎన్నో పోషకాలు ఉంటాయి కనుక పలు రకాల మేలు చేస్తూనే ఉంటాయి.


ముఖ్యంగా కలబంద మొక్కలను ఇంటి గుమ్మం ముందర వేలాడదీయడం వల్ల నరదృష్టి పోతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీనివల్ల ప్రతికూల శక్తులు అలాగే దుష్టశక్తులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నది. అందుచేతనే వీటిని ఎక్కువగా ఇంటి లోపల ఇంటి బయట మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కలబంద మొక్క ఉండడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి.. ఒకవేళ కలబంద మొక్క వాడిపోయినట్టు అయితే దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చట.


కలబంద మొక్కను ఏదైనా మూల ఉంచితే మంచిది.. కలబంద మొక్క స్వచ్ఛమైన గాలిని అందించడానికి చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా కలబంద మొక్కలు ఎలాంటి ప్రదేశంలోనైనా పెరుగుతాయి. కలబంద గుజ్జు ముఖానికి అప్లై చేసుకున్నట్లు అయితే ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే కలబంద ఇంటి ఆవరణంలో ఉండడం చాలా మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: