మాంసం కంటే కూడా చాలా రకాల బలమైన ఆహారాలు ఉంటాయి. మాంసం కంటే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఎక్కువ బలమైన ఆహారాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రై నట్స్ ను తీసుకోవడం వల్ల శరీరం చాలా బలంగా తయారవుతుందని డ్రై నట్స్ లో మెకడమియా నట్స్ అన్నింటి కంటే బలవర్దకమైన నట్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఒక 100 గ్రా. మెకడమియా నట్స్ లో 740 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇంకా అలాగే 100 గ్రాముల జీడిపప్పులో 596 క్యాలరీల శక్తి , పిస్తా పప్పులో 626 క్యాలరీల శక్తి, బాదం పప్పులో 655 క్యాలరీల శక్తి ఇంకా వాల్ నట్స్ లో 687 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇంకా అదే విధంగా 100 గ్రాముల చేపలల్లో 80 నుండి 90 క్యాలరీల శక్తి, చికెన్ లో 109 క్యాలరీల శక్తి ఉంటుంది.కాబట్టి మాంసం కంటే కూడా మెకడమియా నట్స్ లో ఎక్కువ శక్తి ఉంటుందని  అలాగే ఈ నట్స్ చాలా రుచిగా ఉంటాయని కూడా నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే ఈ నట్స్ లో మన శరీరానికి మేలు చేసే కొవ్వులు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చాలా బలంగా మారడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో కూడా ఈ నట్స్ మనకు బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే ఈ మెకడమియా నట్స్ లో కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి.అలాగే ఈ నట్స్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు అయితే ఈ నట్స్ ఒక చక్కటి వరమని చెప్పవచ్చు. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగకుండా ఉంటాయి.అలాగే నీరసం రాకుండా ఉంటుంది.


ఇంకా షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల నీరసం, బలహీనత వంటివి తగ్గి శరీరానికి మంచి బలం చేకూరుతుంది.అలాగే బరువు కూడా పెరగచ్చు. ఇంకా అదే విధంగా ఊబకాయంతో బాధపడే వారు ఈ మెకడమియా నట్స్ ను తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరగకుండా ఉంటారు. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా సమయం దాకా ఆకలి వేయకుండా ఉంటుంది. అందువల్ల ఇతర ఆహారాల వైపు చూపు మళ్లకుండా ఉంటుంది. ఇంకా అదే విధంగా సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారు, గర్బిణీలు, బాలింతలు ఇంకా ఆటలాడే వారికి ఈ నట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అలాగే పక్షవాతం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక ఈ నట్స్ ను రోజుకు 4 నుండి 5 గింజల మోతాదులో నానబెట్టి తీసుకోవాలి. పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా కూడా వీటిని తీసుకోవచ్చు. ఈ విధంగా మెకడమియా నట్స్ అన్నింటికంటే బలమైన ఆహారమని వీటిని తీసుకోవడం వల్ల శరీరం చాలా బలంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: