బాల్యం దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం. ఇక సాధారణంగా పిల్లలు రోజంతా చాలా చురుకుగా ఉంటారు. వారు తమ శక్తిని ఎలా ప్రసారం చేస్తారో వారు గుర్తించలేరు. అందువల్ల వారు ఎక్కువగా మధ్యాహ్నం వేళల్లో నిద్రపోతారు. అయితే ఇది వారి రాత్రిపూట నిద్రకు భంగం కలిగిస్తుంది. ప్రతి పిల్లలకి కూడా ఖచ్చితంగా 6-7 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. ఎందుకంటే జీవసంబంధమైన ఎదుగుదల అనేది చాలా వరకు వారి నిద్రలోనే జరుగుతుంది. ఇంకా అలాగే మంచి నిద్ర పిల్లల ఆరోగ్యంగా ఎదగడానికి అలాగే నేర్చుకునే సామర్థ్యం పెరగడానికి దోహదం చేస్తుంది. ప్రతి బిడ్డకు వారి వయస్సు ప్రకారం వేర్వేరు నిద్ర విధానం అనేది ఉంటుంది. మరి పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక నవజాత శిశువులు ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతారు. నవజాత శిశువులకు చిన్న సైకిల్స్ అనేవి ఉంటాయి. అందుకే వారు తరచుగా నిద్రలోకి వెళ్లడం మనం చూస్తాం. ఇంకా ఈ దశలో పిల్లల శారీరక అభివృద్ధి నిద్రలోనే ఎక్కువ జరుగుతుంది.


అలాగే 4-12 నెలల మధ్య వయస్సు ఉన్న పిల్లలు అయితే రోజుకు ఖచ్చితంగా 12 నుంచి 16 గంటలు నిద్రపోవాలి.వారికి నిద్ర వస్తున్నప్పుడు కళ్ళు రుద్దడం ఇంకా ఆవులించడం వంటివి చేస్తుంటారు.1-2 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రతి 24 గంటలకు కూడా ఖచ్చితంగా 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం.అలాగే 3-5 సంవత్సరాల దశలో, నిద్ర చక్రం అనేది కొద్దిగా మారుతుంది. ఇక 24 గంటలకు 10 నుండి 13 గంటలకు తగ్గుతుంది. చాలా మంది పిల్లలు కూడా 5 సంవత్సరాల వయస్సులో వారి నిద్రను తగ్గిస్తారు.ఇంకా అలాగే పాఠశాల వయస్సు పిల్లలు అయితే ప్రతి రాత్రి 9-12 గంటలు నిద్రపోతారు. వారికి తగినంత నిద్ర కనుక లేకపోతే, అది ఖచ్చితంగా వారికి చిరాకును కలిగిస్తుంది.కాబట్టి పైన చెప్పిన ప్రకారంగా పిల్లలని నిద్ర పోయేటటట్లు చూసుకోండి. వారిని ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: