కొన్ని టిప్స్ పాటిస్తే బరువు సులభంగా తగ్గొచ్చని పేర్కొంటున్నారు. ఆ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.. మనకు ఈజీగా దొరికే కొన్ని కూరగాయలతో బరువు తగ్గొచ్చని పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో మీరు ఈ కూరగాయలను కనుక మీ ఆహారంలో చేర్చుకుంటే.. బరువు ఈజీగా అదుపులో ఉంటుందని.. ఇంకా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బెండకాయ కూరగాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది.ఇంకా అలాగే ఇది బరువు తగ్గించడంలో కూడా మీకు సహాయపడుతుంది. దీన్ని ఎలాగైనా కూడా తీసుకోవచ్చు.చాలా మంది కూడా చేదును తినడానికి అసలు ఇష్టపడరు. అయితే, అనేక వ్యాధుల చికిత్సలో కాకరకాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తప్పనిసరిగా తినాలని నిపుణులు సూచిస్తారు. ఇంకా అదేవిధంగా, ఈ కూరగాయ బరువు తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. కాకరకాయ రుచిలో చాలా చేదుగా ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.


ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది.వేసవి కాలంలో మార్కెట్‌లో దోసకాయలు బాగా దొరుకుతాయి. ఎందుకంటే దోసకాయలో చాలా నీరు ఉంటుంది. దోసకాయ తినడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంటుంది. దోసకాయలో ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది. మీరు దీన్ని మీ ఆహారంలో చాలా విధాలుగా చేర్చవచ్చు. అలాగే ఇందులో జీరో క్యాలరీలు ఉంటాయి.బరువు తగ్గడానికి దోసకాయ చాలా మంచి ఎంపిక.ఇంకా సోరకాయలో పోషకాలతో పాటు నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వేసవి కాలంలో బరువు తగ్గాలనుకుంటే సొరకాయ రసం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.. మాములుగా సొరకాయను ఎక్కువగా తింటారు. కూర, చట్నీ ఇలా చాలా రకాలుగా చేసుకుని తింటారు. అయితే, బరువు తగ్గాలనుకుంటే మాత్రం సొరకాయ రసం కూడా తాగవచ్చు. చాలా మంది కూడా ఈ కూరగాయను ఇష్టపడనప్పటికీ.. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుందన్న విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: