గుంటగలగరాకు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. అలాగే మన కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేగాక పొట్టలో అల్సర్ సమస్య తగ్గుతుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ గుంటగలగరాకుతో మనం ఓ రుచికరమైన పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల ఖచ్చితంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలన్నింటిని  పొందవచ్చు.


ఇక ఈ గుంటగలగరాకుతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.గుంటగలగరాకు పచ్చడి తయారు చేయడానికి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..గుంటగలగరాకు – ఒక కప్పు, పుదీనా – ఒక పెద్ద కట్ట, నూనె -ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 6 ఇంకా అలాగే చింతపండు – రెండు రెమ్మలు, ఉప్పు- తగినంత, పసుపు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, బెల్లం – కొద్దిగా తీసుకోవాలి.


గుంటగలగరాకు పచ్చడి తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మనం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తరువాత శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఇక ఆ తరువాత ఎండుమిర్చి వేసి వేయించి వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే తరువాత అదే కళాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.ఆ తరువాత పుదీనా, గుంటగలగరాకు వేసి కలపాలి. ఇంకా ఇందులోనే చింతపండు కూడా వేసి కలపాలి. దీనిని ఒక 2 నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి ఆకును మెత్తగా ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన దినుసులను తీసుకుని వాటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: