రక్తహీనత సమస్యను అసలు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రక్తహీనత సమస్య ఉన్న వారిలో శరీరం ఉబ్బినట్టుగా ఉంటుంది.ఇంకా అలాగే దీని కారణంగా నీరసం, నిస్సత్తువ, చర్మం పాలిపోవడం, శరీరం బలహీనపడడం, జుట్టు రాలడం వంటి ఇతర అనేక రకాల సమస్యలు కూడా తలెత్తుతాయి. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడమే ఈ సమస్య తలెత్తడానికి ముఖ్య కారణం. ఇంకా అలాగే గాయాలు తగిలి రక్తస్రావం ఎక్కువగా జరిగినప్పుడు కూడా ఈ సమస్య అనేది తలెత్తుతుంది.ఇంకా అదే విధంగా స్త్రీలల్లో నెలసరి సమయంలో తలెత్తే అధిక స్రావం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి ఐరన్ టాబ్లెట్ల్ లను, సిరప్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వీటినే వాడే అవసరం లేకుండా మనం తీసుకునే ఆహారాల ద్వారా కూడా మనం రక్తహీనత సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. మన శరీరంలో రక్తం తయారవ్వాలంటే మనకు ఐరన్ అనేది ఎక్కువగా అవసరమవుతుంది.


పురుషులకు రోజుకు 28 మిల్లీ గ్రాములు ఇంకా స్త్రీలకు రోజుకు 30 మిల్లీ గ్రాముల ఐరన్ అనేది అవసరమవుతుంది.ఈ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మనకు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాల్లో మామిడి కాయ పొడి కూడా ఒకటి.ఆకు కూరల్లో కంటే మామిడికాయ పొడిలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని వంటల్లో చింతపండుకు బదులుగా వాడుకోవడం వల్ల మనం రుచితో పాటు రక్తహీనత సమస్య నుండి కూడా చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇక ఈ పొడిని పచ్చళ్లల్లో, కూరలల్లో వాడుకోవచ్చు.ఇంకా అలాగే ఈ పొడిలో నీటిని కలిపి చింతపండు పులుసుగా కూడా వాడుకోవచ్చు. అలాగే మామిడికాయ పొడితో పాటు ఆకుకూరలు, పప్పు దినుసులు, ఖర్జూరాలు, డ్రై ఆఫ్రికాట్, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి, గుమ్మడి గింజలు ఇంకా అంజీరాలు వంటి వాటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: