మన శరీర జీవక్రియ రేటు సక్రమంగా ఉంటేనే, ప్రతిభాగము వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి.దానితో మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. మరియు మన ఆయుర్దాయం కూడా పెరుగుతుంది కూడా.కానీ ఈ మధ్యకాలంలో ఉన్న జీవన శైలి కారణంగా రోజురోజుకీ జీవక్రియ రేటు తగ్గి,అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి.కావున మన జీవక్రియ రేటు పెంచుకోవడానికి తగిన అలవాట్లతో సమాధానం చెప్పవచ్చు అని ఆహార నిపుణులు చెబుతున్నారు.మరి అలాంటి ఆహారాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

అధిక ప్రోటీన్..

అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది.అధిక ప్రోటీన్ లో ఉన్న థర్మిక్ గుణము మనం తిన్న ఆహారంలోని క్యాలరీలను సక్రమంగా జీర్ణం చేయడానికి ఉపయోగపడి,మెటబాలిజం రేటును పెంచుతుంది.

తగినంత నీరు..

రోజు తగినంత నీరు తీసుకోవడం వల్ల,మన శరీరంలో ఉన్న టాక్సిన్ లన్ని యురిన్ రూపంలో బయటికి వెళ్లిపోతాయి.మరియు మన శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.దీనితో మెటబాలిజం రేటు పెరుగుతుంది.కావున తగిన నీరు తీసుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

వ్యాయామాలు..

రోజు వ్యాయామం చేయడం వల్ల,మన తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్స్,అధిక కొవ్వులను కరిగించడానికి వ్యాయామాలు చాలా బాగా ఉపయోగపడతాయి.దీనితో మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది.కావున రోజు అరగంట సేపైనా వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.

నిలబడి ఉండడం..

ఈ మధ్యకాలంలో ఆఫీస్ వర్క్ పుణ్యమా అని,ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది.దానితో అనారోగ్య సమస్యల అధికమవుతున్నాయి.కావున ఎక్కువసేపు నిలబడి ఉండడానికి ప్రయత్నించండి.దీనితో అధిక క్యాలరీలు ఖర్చు అయ్యి,మెటబాలిజం రేటు పెరుగుతుంది.ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా రెండు మూడు గంటలకైనా ఒకసారి లేచి,అటుఇటు తిరగడం అలవాటు చేసుకుంటే చాలా ఉత్తమం.

రోజు గ్రీన్ టీ తాగడం..

రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల,అందులో కేటాచిన్ అనే ప్లేవనాయిడ్ పుష్కలంగా అందుతుంది. దీనితో మెటాలిజం రేటు పెరుగుతుంది.మరియు ఇందులోనీ యాంటీ ఆక్సిడెంట్ లు రోగనిరోధక శక్తి పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: