సాధారణంగా చాలామంది కాఫీ కాఫీ తో బ్రెడ్ తీసుకోవడం కానీ లేకుంటే టిఫిన్ లేదా స్నాక్స్ తయారు చేసుకొని తినడం అలవాటు ఉంటుంది.ఇక వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్నవాళ్లు కచ్చితంగా బ్రెడ్ ముక్కల తోటి కడుపు నింపుకోవాల్సిందే.కొంతమందికి మాత్రం బ్రెడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయని అపోహ కూడా ఉంది.కానీ కొన్ని పరిశోధనల ప్రకారం బ్రెడ్ తీసుకోవడమే మంచిది అని ఆహార నిపుణులు చెబుతున్నారు.అటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మనము తెలుసుకుందామా..

సాధారణ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఫైబర్,ఐరన్ విటమిన్ బి, పోలేట్ వంటి పోషకాలు ఎన్నో పుష్కలంగా లభిస్తాయి.రోజుకు మోతాదులో బ్రెడ్ తీసుకోవడం వల్ల మన జీర్ణశక్తి కూడా మెరుగుపడి మనకు మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుందట.

అనారోగ్యంతో బాధపడేవారికి బ్రెడ్ మంచి ఆహారమని చెప్పవచ్చు.వారికి ఇతర పదార్థాలు తినడానికి ఎంత శక్తి లేకపోయినా బ్రెడ్ తొందరగా తింటారు.దానితో తొందరగా శక్తి కలిగి,వారు వెంటనే కోలుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.ఇందులోనే ప్రోటీన్ కండర శక్తిని కలిగించి,వారు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

సాధారణంగా బాలింతలకు పాలు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి బ్రెడ్ ఇస్తూ ఉంటారు.వీరికి సాధారణ బ్రెడ్ కన్నా మిల్లెట్ బ్రెడ్ పెట్టడం చాలా మంచిది.ఇందులోనే కాల్షియం పాల ఉత్పత్తికి ఉపయోగపడి, ఉపయోగపడటమే కాకుండా,బిడ్డ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఎదిగే పిల్లలకు మిల్లెట్ బ్రెడ్ తో టిఫిన్లు కానీ, స్నాక్స్ కానీ పెట్టడం వల్ల,ఇందులోని అధిక ప్రోటీన్ వారి ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.ఇందులోనే క్యాల్షియం వారి మెదడు పనితీరు మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

అంతేకాక మనలో కొంతమందికి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి.దానికి కారణం మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడమే.అలాంటప్పుడు పీనట్ బటర్ వేసిన తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యం మెరుగు పడుతుంది.కానీ ఇన్ని ప్రయోజనాలు బ్రెడ్ ను మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే కలుగుతాయని గుర్తు పెట్టుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: