నేటి కాలంలో యుక్త వయసు వారి నుండి పెద్ద వారి దాకా చాలా మంది కూడా ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆందోళన అదుపులో ఉండక చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు.దీని వల్ల ఖచ్చితంగా మానసికంగా అలాగే శారీరక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆందోళనతో బాధపడే వారు వారు బాధపడుతూ ఇతరులను కూడా బాధిస్తూ ఉంటారు. అయితే మందులను వాడడం వల్ల సమస్య కొద్దిగా అదుపులో ఉన్నప్పటి పూర్తిగా మాత్రం తగ్గదు. ఇలా ఆందోళనతో బాధపడే వారు సహజసిద్దంగా కొన్ని ఆహారాలను తీసుకుంటూ కొన్ని నియమాలను పాటించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఆందోళన సమస్యతో ఎక్కువగా బాధపడే వారు నీటిలో పసుపును కలిపి తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య తగ్గుతుందని వారు చెబుతున్నారు.అయితే ఇలా తీసుకునే వారు ఆర్గానిక్ పసుపుని మాత్రమే వాడాలి. ఇంకా అలాగే మెదడు కణాలకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అందించడం వల్ల కూడా ఆందోళన సమస్య తగ్గుతుంది.


అలాగే అవిసె గింజలు, చేపలు, వాల్ నట్స్, బాదంపప్పు వంటి వాటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుంది.ఇంకా అదే విధంగా బి కాంప్లెక్స్ ఎక్కువగా ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడు కణాలు శుభ్రపడాలన్నా అవి సరిగ్గా పని చేయాలన్నా బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి చాలా అవసరమవుతాయి. ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువగా ఉండే వాటిలో తవుడు కూడా ఒకటి. మనం తవుడును నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఇంకా అలాగే చపాతీ పిండిలో కలిపి చపాతీలు చేసుకుని తినవచ్చు. అలాగే ఖర్జూరాలతో తినవచ్చు. ఇలా ఏదో ఒకరూపంలో తవుడును తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇంకా అదే విధంగా ఉడికించని పచ్చి ఆహారాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆందోళన  త్వరగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: