గులాబీ పూలు..
గులాబీ పూలు ఇష్టపడని వారుండరు.దానికి కారణం వాటి అందమే.అటువంటి గులాబీ పూలను ఎండబెట్టి లేదా అలానే టీలో కానీ,స్వీట్స్ లో కానీ వేసుకోవడం వల్ల,ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ ని సైతం దూరంగా ఉంచుతాయి.అంతేకాక ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ముందుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.కావున అధిక బరువుతో బాధపడేవారు రోజూ గుప్పెడు గులాబీ పూలను ఏదో రూపంలో తీసుకోవడం ఉత్తమం.
బొప్పాయి పూలు..
బొప్పాయి చెట్టు వేరు నుంచి పూల వరకు ప్రతి భాగము ఉపయోగపడేవే.ఈ పూలతో తయారు చేసిన టీ తాగడం వల్ల డెంగ్యూ లక్షణాల నుంచి తొందరగా ఉపశమనం కలిగించుకోవచ్చు.అంతేకాక మధుమేహ రోగులకు ఇది మంచి మెడిసిన్ అని కూడా చెప్పవచ్చు.దీనిని తరుచూ తీసుకోవడం వల్ల,గుండె మరియు లివర్ ఆరోగ్యానికి కూడా కాపాడుకోవచ్చు ఇన్ని సుగుణాలు కలిగిన ఈ టీని మాత్రం తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం.
అరటి పువ్వు..
అరటి పువ్వును తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోని విటమిన్ సి మరియు అధిక ఫైబర్ తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడటమే కాకుండా,అధిక రక్త ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
మొరింగా..
మొరింగా ఫ్లవర్ తో కాచిన టీ తీసుకోవడంతో, పొటాషియం,మెగ్నీషియం,అధిక ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.ఈ గుణాలు శరీర కండరజాలాన్ని మెరుగుపరుస్తాయి.అంతేకాక గుండె పోటు,అధిక బీపీ వంటివి దరి చేరకుండా కాపాడుతాయి.
మాహువా..
మాహువా అనే ప్లవర్ తేనే,జామ్,జ్యుస్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.ఈ పూలతో కాచిన టీ తీసుకోవడంతో,శ్వాస కోశ వ్యాధులు,గుండె జబ్బులు రాకుండా కాపాడేందుకు ఉపయోగపడతాయి.