మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు కూడా ఒకటి.. ఊపిరితిత్తులు సరిగ్గా లేకపోతే మన శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.. మన జీవితం మొత్తం శ్వాస మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.. అందుచేతనే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిది. గడిచిన రెండు మూడేళ్ల క్రితం కరోనా వల్ల మన ఊపిరితిత్తులు పలు రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా దృఢంగా ఉన్నట్లు అయితే ఎలాంటి జబ్బు బారిన పడే అవకాశం ఉండదు..


గాలిలో ఉండే విష పదార్థాలు, కాలుష్య కారకాలు పొగ దుమ్ము ధూళి వంటి వాటి వల్ల ఊపిరితిత్తులు బలహీనపడతాయి. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి అంటే వీటిని క్లీన్ చేసుకోవడం మంచిది. అయితే ఊపిరితిత్తులు క్లీన్ గా శుభ్రంగా ఉండాలి అంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిదట. ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకుంటూ ఉండటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయట. ప్రతిరోజు ఆరెంజ్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి వల్ల ఊపిరితిత్తుల ఆక్సిజన్ పెంపొందించేలా చేస్తుంది. అలాగే ఉల్లిపాయలను ప్రతిరోజు తినడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసేలా చేస్తుందట.


మరొక పండు దానిమ్మ ఈ దాని మనం తింటూ ఉండడం వల్ల.. శ్వాస సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. యాపిల్ లో ఉండే విటమిన్ సి ఈ బి.. ప్లేవానాఇడ్స్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయట. వీటితోపాటు ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలోకి కాస్త నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల.. ఊపిరితిత్తులలో ఉండే కఫం స్లేషం ఉండకుండా ఉంటుందట. వీటన్నిటినే కాకుండా పుదీనా అని ప్రతిరోజు రెండు ఆకులు తినడం వల్ల ఊపిరితిత్తుల శుభ్రంగా మారుతాయి. వీటిని తరచూ పాటిస్తూ ఉంటే కచ్చితంగా ఊపిరితిత్తులు శుభ్రపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: