ఈ మధ్యకాలంలో చాలామందికి ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగి, రకాల డైట్లను ఫాలో అవుతూ ఉంటారు కానీ పేర్లలో ఎక్కువగా కాస్ట్లీ గా ఉన్న డ్రైఫ్రూట్స్ బాదం కిస్మిస్ వాల్ నట్స్ వంటివి తీసుకోవాలని ఆ డైట్ లకి దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది కానీ అలాంటి వారి కోసం మన న్యాచురల్ గా దొరికే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను అందిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. కాస్ట్లీ డ్రైఫ్రూట్స్ కన్నా తక్కువ ఖర్చులో దొరికే డ్రై ఫ్రూట్స్ లోనే శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్ ఎన్నో పుష్కలంగా లభిస్తాయట.మరి అవి ఏంటో తెలుసుకుని మనము డైట్ స్టార్ట్ చేద్దామా..

ఖర్జురం బదులుగా అరటిపండు..

అరటిపండుతో పోలిస్తే ఖర్జురం ధర ఎక్కువనే చెప్పాలి. ఖర్జురం కొనలేనివారు అరటిపండు కొని తినవచ్చు. ఎందుకంటే ఖర్జురంలో వున్న సోడియం,పోటాషియం, సల్ఫర్,పైబర్,క్యాలిషియం వంటి పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.కావున చిన్నపెద్దా తేడా లేకుండా రోజుకొక అరటిపండు తినడం చాలా ఉత్తమం.

జీడిపప్పు బదులుగా పుచ్చకాయ గింజలు..

జీడిపప్పులోని ఐరన్,పోటాషియం,క్యాలిషియం వంటి పోషకాలు తక్కువ ధరలో దొరికే పుచ్చకాయ గింజలలో పుష్కళంగా లభిస్తాయి.కావున రోజూ రెండు టీ స్ఫూన్ల పుచ్చకాయ గింజలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు మెదడు చురుగ్గా ఉంటుంది.

పిస్తాపప్పు బదులుగా లినిడ్స్..

పిస్తాపప్పు కొనాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతాయి. వాటి బదులుగా లినిడ్స్ తీసుకోవడం ఉత్తమం.పిస్తాపప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్,ప్రోటీన్స్,ఫైటో కెమికల్స్,పీచు పదార్థము వంటి పోషకాలు లినిడ్స్ లో పుష్కళంగా లభిస్తాయి.

ఎండుద్రాక్ష బదులుగా శనగలు..

ఎండుద్రాక్ష బదులుగా ఉడకబెట్టిన శనగలు తినడంతో పైబర్,మంచి కొవ్వులు పుష్కళంగా లభిస్తాయి.కావున స్నాక్స్ రూపంలోనో,కర్రీ రూపంలో కానీ శనగలు తినడం ఉత్తమం.

వాల్ నట్స్ బదులుగా సన్ ప్లవర్ సీడ్స్..

వాల్ నట్స్ లోని మాంగనీస్,కాపర్, పోలిక్ యాసిడ్,ఒమేగా -3ప్యాటి యాసిడ్స్ వంటి పోషకాలు సన్ ప్లవర్ సీడ్స్ లలో పోషకాలు పుష్కళంగా లభిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రోజు గుప్పెడు సన్ ప్లవర్ సీడ్స్  తినడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: