టీ,కాఫీ..
రాత్రిపూట మీటింగ్లు అంటే చాటింగ్ లంటూ టీ,కాఫీలు ఐస్ క్రీమ్ లో తెగ తింటూ ఉంటారు.ఇవి ఎక్కువగా తీసుకోవడంతో, వాటిలోని కెపిన్ వల్ల రాత్రిపూట నిద్ర సరిగా పట్టదు.దానితో అసిడిక్ విలువలు పెరిగి కడుపులో మంట,గ్యాస్,చాతినొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
టమాటా..
ముఖ్యంగా రాత్రిపూట టెరమైన్ ఎక్కువగా ఉన్న టమాటా,వంకాయ వంటివి తీసుకోకుండా ఉండాలి.ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మెదడు యాక్టివ్స్ స్టేజ్ లో ఉండి నిద్ర సరిగా పట్టదు.దానితో పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
స్వీట్స్..
రాత్రిపూట శరీరం యాక్టివ్ స్టేజిలో లేక,రక్తంలోని చక్కెరలను తక్కువగా ఉపయోగించుకుంటుంది.ఆ సమయంలో ఎక్కువగా స్వీట్స్ తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగి,అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చికెన్ మటన్..
రాత్రి సమయంలో పార్టీలు,ఫంక్షన్ ఉంటే చికెన్,మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తొందరగా జీర్ణం కాదు.అంతేకాక అధిక క్యాలరీలను కూడా రిలీజ్ చేస్తుంది.ఆ క్యాలరీలు నిద్ర సమయంలో బర్న్ కాక చెడు కొలెస్ట్రాల్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున రాత్రి సమయంలో చికెన్ మటన్ కు దూరంగా ఉండటం మంచిది.
సిట్రస్ ఫ్రూట్స్..
ఆసిడిక్ విలువలు అధికంగా కలిగిన ఫ్రూట్స్ ని రాత్రి సమయంలో తీసుకోవడంతో అందులోని యాసిడ్ విలువలు పెరుగుతాయి.దీనితో మరియు ఎసిడిటీ మరియు గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కావున ప్రతి ఒక్కరూ పైన చెప్పిన ఆహారాలకు రాత్రి సమయంలో దూరంగా ఉండటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.