ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తే సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అనే విషయంపై అటు నిపుణులు కూడా పలు ఆసక్తికర విషయం చెప్పారు. ఏ వ్యక్తి అయినా రోజుకు 6 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం అని చెప్పాలి. అయితే కొంతమంది వ్యక్తులు దీని కంటే తక్కువ లేదా ఎక్కువ తరచుగా మూత్ర విసర్జన చేస్తారు. కాబట్టి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండాల్సిన అవసరం కూడా ఉండదట. అయితే ఎందుకంటే మూత్ర విసర్జనకు వెళ్లే సందర్భం రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో మొదటిది మూత్రశయం ఎంత పెద్దది.. రెండవది రోజు ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నారు అన్నది.
మీరు తరచుగా మూత్ర విసర్జన చేయడాన్ని ప్రభావితం చేసే మరొక విషయం కూడా అధిక కెఫెన్ వినియోగం. అవును రోజు ఎంత టి లేదా కాఫీ తాగుతారు అన్న విషయంపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అదనంగా ధూమపానం చేసేవారు తరచుగా బాత్రూం కి వెళ్తారట. మూత్ర విసర్జన చేసినప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. లేదా ఎక్కువ ద్రవ ఆహారాన్ని తీసుకుంటారు. ఇక మీరు తక్కువగా తరుచుగా మూత్ర విసర్జన చేసినట్లయితే మీరు తక్కువగా నీరు తాగాలి. తక్కువగా నీరు తాగినప్పుడు మూత్రం రంగు కూడా పసుపు రంగులో ఉంటుందట. ఎక్కువ నీరు టీ కాఫీ లేదా తాగితే తరచూ మూత్ర విసర్జన చేస్తారు. ఈ కారకాలు కాకుండా తరచూ మూత్ర విసర్జన లేదా రాత్రిపూట తరచుగా టాయిలెట్ కి వెళ్తే మీ ఆరోగ్యంలో ఏదో తేడా ఉందని అర్థం చేసుకొని డాక్టర్ ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.