ప్రతిరోజూ మనం ఒక లడ్డూను తింటే చాలు మన శరీరంలో రోగనిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది. దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇంకా అంతేకాకుండా ఎముకలు కూడా చాలా ధృడంగా తయారవుతాయి.కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. అలాగే శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ లడ్డూలను పిల్లలు, పెద్దలు ఇంకా బాలింతలు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల అనేది చాలా చక్కగా ఉంటుంది. వారి శరీరం బలంగా ఇంకా ధృడంగా తయారవుతుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా మీరు ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి.తరువాత అందులో పాలను పోసుకుంటూ కలుసుకోవాలి.ఆ తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఈ పిండిని జల్లెడలో వేసి కాసేపు జల్లించాలి. ఇక ఉండలుగా ఉన్న పిండిని చేత్తో నలుపుతూ జల్లించి గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఆ తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి కూడా వేయించాలి.ఇవి వేగిన తరువాత ఎండు కొబ్బరి తురుము అందులో వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే కళాయిలో నెయ్యిని వేసి వేయించాలి.ఆ తరువాత 2 టేబుల్ స్పూన్ల గోంధ్ ను కూడా వేసి వేయించాలి. ఇలా వేయించడం వల్ల గోంధ్ తెల్లగా పొంగుతుంది. ఇలా వేగగానే గోంధ్ ను మీరు ప్లేట్ లోకి తీసుకోవాలి.మళ్ళీ కొద్ది కొద్దిగా నెయ్యని, గోంధ్ ను వేసుకుంటూ వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ముందుగా రెడీ చేసుకున్న గోధుమ రవ్వను వేసి వేయించాలి.


ఇక ఇప్పుడు ముందుగా వేయించిన గోంధ్ ను చేత్తో మెత్తగా చేసుకోవాలి. ఆ తరువాత ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్, గోధుమ రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ తరువాత కళాయిలో బెల్లం తురుము ఇంకా 2 టేబుల్ స్పూన్స్ నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి తీగ పాకం వచ్చిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి వడకట్టాలి. ఆ తరువాత ఈ పాకాన్ని ముందుగా తయారు చేసుకున్న గోంధ్ మిశ్రమం వేసి కలపాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత అంతా బాగా కలిసేలా కలుపుకుని కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే ఇమ్యూనిటీ లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూను రోజూ ఒకటి చొప్పున తినడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: