ఇప్పుడు చెప్పే డ్రింక్ ని తాగడం వల్ల పొట్టలో, నడుము చుట్టూ, ఇంకా అలాగే ఇతర శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. బరువు తగ్గించడంలో ఈ డ్రింక్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. నేటి కాలంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.మారిన మన ఆహారపు అలవాట్లు ఇంకా జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మనల్ని ఎంతగానో వేధించే ఈ అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి మార్కెట్ లో లభించే మందులను, పౌడర్ లను వాడుతూ ఉంటాం. వీటిని వాడడం వల్ల బరువు తగ్గకపోగా దుష్ప్రభావాలను మనం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది.అధిక బరువు తగ్గాలనుకునే వారు ఇలా మందులను వాడే అవసరం లేకుండా మన ఇంట్లోనే సహజంగా లభించే పదార్థాలతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ పానీయాన్ని తాగిన రెండు వారాల్లోనే మన శరీరంలో వచ్చే మార్పును మనం ఈజీగా గమనించవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేసే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం మనం ఒక క్యాప్సికంను, ఒక ఇంచు అల్లం ముక్కను వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వాటిని వేడి చేయాలి. ఇందులోనే చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలను ఇంకా అల్లం ముక్కలను వేసి ముప్పావు గ్లాస్ అయ్యే దాకా మరిగించాలి.తరువాత ఈ నీటిని వడకట్టి అందులో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం తేనె కలపకుండా తీసుకోవాలి. ఇక క్యాప్సికంలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా చాలా ఉంటాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో క్యాప్సికం చక్కగా పని చేస్తుంది. ఇంకా అలాగే మనం తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా చేయడంలో కూడా క్యాప్సికం మనకు సహాయపడుతుంది.ఇంకా అంతేకాకుండా ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.జీర్ణక్రియ కూడా సక్రమంగా పని చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ విధంగా క్యాప్సికంతో పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: