మనకు చాలా చౌకగా దొరికేటువంటి వాటితో రాగి జావా కూడా ఒకటి.. ఇది మనం రోజు ఒక గ్లాస్ తాగితే చాలు ఈ రాగి జావ వల్ల మనకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి.. అందుకే డాక్టర్లు సైతం ఎక్కువగా రోజులో ఒక్కసారైనా రాగిజావ ని తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. రాగి జావ వల్ల కలిగే పలు ప్రయోజనాలు తెలుసుకుందాం.



రాగి జావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్య నుంచి విముక్తి పొందుతారు. రాగి జావా లో అద్భుతమైన పోషకాహారం కలిగిన ప్రొఫైల్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్స్ మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తదితర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.


రాగి జావాలో చాలా తక్కువగా ఉండే కొలెస్ట్రాల్ సోడియం స్థాయిలను కలిగి ఉంటుంది.. విటమిన్ -C,E వంటివి కలిగి ఉంటాయి బీ కాంప్లెక్స్ విటమిన్లు పోలింగ్ యాసిడ్ అలాగే కాల్షియం ,మెగ్నీషియం, ఐరన్ తదితరవి అధికంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి.


రాగి జావా లో లభించే ప్రధాన పోషకం ప్రోటీన్. ఇది జీవ విలువలను అధికంగా కలిగి ఉండడానికి సహాయపడుతుంది. పోషకాహార లోపాన్ని నివారించడంలో చాలా సహాయపడుతుంది. శరీరంలో ఇతర భాగాలకు సైతం ఆక్సిజన్ రవాణా చేయడంలో సహాయం చేస్తుంది.


రాగి జావా లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇది ఎక్కువ సేపు  అన్నం ఆకలి కాకుండా ఉండేలా చేస్తూ ఉంటుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


రాగి జావ రోజు తీసుకోవడం వల్ల డిప్రెషన్ నిద్రలేని సమస్యలు ఆందోళన వంటి సమస్యలు కూడా దూరమవుతాయి ఇందులో అమైన ఆమ్లాలు ఉండడం వల్ల విశ్రాంతిని తీసుకొనేలా చేస్తాయి. అయితే రాగి జావా ను రాత్రి పూట తీసుకోవడం మంచిది కాదట జీర్ణ సమస్యలు అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట తాగకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: