ఈ మధ్యకాలంలో చాలామందికి ఊరుకురికే ఫుడ్ తినాలనిపిస్తూ ఉండటం,టీవీ,మొబైల్ చూస్తున్న ఏదో ఒకటి తింటూనే ఉంటారు.మరియు పిల్లలు ఎలక్ట్రికల్ వస్తువులకు ఆడిక్ట్ అయి వారు ఏం తింటున్నారో ఎంత తింటున్నారో తెలియకుండా తిని,ఉబకాయం వచ్చి బాధపడుతూ ఉన్నారు.ఇలా తినడం వల్ల మొదట్లో బాగానే ఉన్నా,రానురాను గుండెపోటు సమస్యలు ఊబకాయం,అధిక బరువు,అధిక కొలెస్ట్రాల్,కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని తగ్గించుకోవాలంటే ముందుగా అతిగా వచ్చే ఫుడ్ క్రెవింగ్స్ ని తగ్గించుకోవాలి.అసలు ఫుడ్ క్రెవింగ్స్ ఎందుకు వస్తాయో అవి ఎలా తగ్గించుకోవాలో,మనం కూడా తెలుసుకుందాం పదండి..

తగిన నిద్ర లేకపోవడం..

చాలామంది వారి పని ఒత్తిడి వలన లేకుంటే ఎలక్ట్రికల్ వస్తువులు చూస్తూ ఉండడటం కారణం వల్ల,తగిన నిద్ర లేకుండా ఉంటారు.అలాంటప్పుడు మన మెదడులోని కొన్ని రకాల రసాయనాలు విడుదలై ఫుడ్డు తినాలని కోరికను పెంచుతాయి.దీనితో ఫుడ్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది.కావున ప్రతి ఒక్కరూ రోజుకు 7నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడానికి సమయం కేటాయించుకోవడం చాలా మంచిది.

తగిన ప్రోటీన్ తీసుకోకపోవడం..

చాలామంది జంక్ ఫుడ్ బారిన పడి,తగిన ప్రోటీన్ మరియు తగిన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఫుడ్ క్రెవింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.కావున సరైన ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ముఖ్యం.

అధిక ఒత్తిడి..

వారు చేసే పని వల్ల,కుటుంబ సమస్యల వల్ల చాలామంది అధికంగా ఆలోచిస్తూ,వారికి సరైన సమాధానాలు లభించక,అదే పనిగా తింటూ ఉండడం అలవాటు చేసుకుంటూ ఉంటారు.దీని వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు. కావున చాలామటుకు అతిగా ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి యోగ మరియు ఎక్ససైజ్ వంటివి  చేసుకోవడం ఉత్తమం.

డిహైడ్రేషన్..

సరైన మొతాదులో నీటిని తీసుకోకపోవడం వల్ల కూడా ఎక్కువ తినాలని కోరిక పెరుగుతుంది.కావున ప్రతి ఒక్కరు రోజుకు ఐదు లీటర్ల నీరు తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి.

మైండ్ ఫుల్ ఈటింగ్ చేయకపోవడం..

మనం తినాలనే కోరిక మన మెదడులో రసాయనాల వల్ల ఎక్కువగా ఉంటుంది.కానీ చాలామంది పొట్ట నిండిందా లేదా అని మాత్రమే చూసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా ఫుడ్ గ్రేవింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.అలాకాకుండా మైండ్ కి రిలీఫ్ ఇచ్చేలాగా నెమ్మదిగా,అస్వాధిస్తూ తినడం వల్ల కూడా అధికంగా  తినాలని కోరిక తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: