మధ్యాహ్న భోజనాన్ని నిర్లక్ష్యం చేయడం, పూర్తిగా తినడమే మానేయడం వంటివి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఈ అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్న భోజనం దాటేయడం వల్ల మనం రోజులో అతిగా తినే అవకాశం ఉంది. ఇంకా అలాగే ఇది మన శక్తి సామర్థ్యాలపై మన ఏకాగ్రతపై కూడా ప్రభావం చూపుతుంది.కాబట్టి సమతుల్య ఆహారాన్ని ప్రతి రోజూ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా అలాగే కేలరీలు, సోడియం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో హాని కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ , ఉప్పు, చక్కెర కలిగిన జంక్ ఫుడ్ ను, ఫ్రోజెన్ మీల్స్ వంటి వాటిని కూడా తీసుకోవడం తగ్గించాలి.అయితే వీటికి బదులుగా కూరగాయలను తీసుకోవడానికి ప్రయత్నించాలి.  ఎందుకంటే కూరగాయలల్లో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.


మనం తీసుకునే మధ్యాహ్న భోజనంలో వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలా మంది పని ఎక్కువగా ఉందని, సమయం తక్కువగా ఉందని వారు కూర్చున్న దగ్గరే ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఎప్పుడు కూడా భోజనానికి నిర్ణయించిన సమయంలో, నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే భోజనాన్ని తింటూ ఆస్వాదించాలి. అలాగే చాలా మంది శీతల పానీయాలను, పంచదార ఎక్కువగా ఉండే పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివికావు. అందుకే వీటిని బదులుగా హెర్బల్ టీ వంటి వాటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే మనం ఆహారాన్ని తీసుకునే ముందు ఏం తింటున్నామో తెలసుకుని మనం తినే ఆహారాన్ని ఖచ్చితంగా ఆస్వాదిస్తూ తినాలి. ఎందుకంటే ఇలా తినడం వల్ల మనం ఎక్కువగా తినకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. ఇంకా అలాగే ఇలా తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: