ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందర్నీ డయాబెటీస్ సమస్య ఎంతగానో వేధిస్తోంది. దీంతో ఏ ఆహారం తిన్నాలన్నా కూడా ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.ఏం తిన్నా కానీ బ్లడ్ లో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరిపోతాయి. కానీ  ఆకలి మాత్రం వేస్తూ ఉంటుంది. దీంతో కంగారు పడుతూ ఉంటారు. మందులు వేసుకుంటున్నాం కదా పర్వాలేదని మరి కొందరు ఏది పడితే అవి తినేస్తారు. దీంతో ఆ తర్వాత ఇన్సులిన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధి  ఒక్కసారి వచ్చిందంటే అంత త్వరగా పోదు.ఇక దాన్ని మనమే కంట్రోల్ లో ఉంచాలి. తిన్న తర్వాత ఖచ్చితంగా బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. అవి పాటించి చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపు చేయవచ్చు.పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం ఖచ్చితంగా తీసుకోండి.మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఫైబర్ ఒక రకమైన కార్బోహైడ్రేట్ కావడం వల్ల ఇది త్వరగా బాడీలో కరగదు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం  చక్కెర ఉత్పత్తిని తక్కువ చేస్తుంది. కాబట్టి మీరు తిన్న తర్వాత  షుగర్ లెవల్స్ పెరగవు.ఆకలి వేస్తుందని చాలా మంది కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేస్తారు. కానీ ఖచ్చితంగా ఇది చాలా తప్పు.


అలా తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోతాయి. కాబట్టి ఒక్కటే సారి కాకుండా.. కొంత మోతాదులో మాత్రమే మీరు తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే.. కడుపు నిండిన భావన మీకు కలుగుతుంది.మధు మేహంతో బాధ పడేవారైనా లేక డయాబెటీస్ లేని వారైనా తిన్న వెంటనే అస్సలు నిద్ర పోకూడదు. ఎందుకంటే దీని వల్ల కూడా షుగర్ లెవల్స్ అనేవి పెరిగిపోతాయి. ఇంకా అలాగే బరువు కూడా పెరుగుతారు.ఉదయం పూట స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లే హడావిడిలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మధు మేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉదయం పూట అల్పాహారం తినకపోతే.. మీ రక్తంలో షుగర్ లెవల్స్ ఖచ్చితంగా చాలా వేగంగా పెరుగుతాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ ని అస్సలు స్కిప్ చేయకూడదు. ఇంకా అలాగే మీ టిఫిన్ లో ప్రోటీన్, ఫైడర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవలి.ఇక నిద్ర వల్ల కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఖచ్చితంగా షుగర్ కూడా ఒకటి.అందుకే సరైన నిద్ర లేకపోతే షుగర్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలు అధ్యయానలు తేల్చి చెప్పాయి. కాబట్టి నాణ్యమైన నిద్ర అనేది చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: