కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటి గురించి మనం ముందుగా తెలుసుకుంటే మనం సులభంగా కాలేయం  ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిలో ఖచ్చితంగా మధ్యపానం  ఉంటుంది. మనం తీసుకునే ఆల్కహాల్ ను పూర్తిగా విచ్చినం చేసి మన శరీరానికి హాని కలగకుండా కాపాడడంలో కాలేయం అనేది దోహదపడుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ కణాలు వాటిని విచ్ఛిన్నం చేయలేక అవి దెబ్బతింటాయి. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇంకా అలాగే చాలా మంది పోషకాహారాన్ని తీసుకోరు. కాలేయ కణాలు మృతకణాలను బయటకు పంపించాలంటే వాటికి పోషకాలు అనేవి చాలా అవసరం.విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇంకా ఆమైనో యాసిడ్లు ఇలా చాలా రకాల పోషకాలు కాలేయ కణాలకు అవసరమవుతాయి. ఈ పోషకాలను తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థాలు కాలేయ కణాలను బాగా దెబ్బతీస్తాయి. కాబట్టి పండ్లను, జ్యూస్ లను, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, మొలకెత్తిన గింజలు వంటి వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి.


ఇక ఊబకాయం ఇంకా జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కూడా కాలేయ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అలాగే నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అందువల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ వచ్చి కాలేయ కణాలు దెబ్బతినడంతో పాటు ఫ్యాటీ లివర్ సమస్య కూడా కూడా తలెత్తుతుంది. దీంతో కాలేయ కణాలు ఈజీగా దెబ్బతింటాయి.ఇంకా అదే విధంగా హెపటైటిస్ ఎ, హైపటైటిస్ బి వంటి వైరస్ లు కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే మనం తీసుకునే మందుల ద్వారా కూడా కాలేయ కణాల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. చాలా మంది విటమిన్స్ కు సంబంధించిన సప్లిమెంట్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల కూడా కాలేయ కణాలు బాగా పాడవుతాయి. ఇక ధూమపానం కారణంగా కూడా కాలేయం బాగా దెబ్బతింటుంది. ధూమపానం చేయడం వల్ల క్రమంగా కాలేయ కణాలకు రక్తప్రసరణ అనేది మందగిస్తుంది. అందువల్ల క్రమంగా కాలేయం దెబ్బతింటుంది. ఇంకా అలాగే శారీరక వ్యాయామం, శ్రమ చేయకపోవడం వల్ల కూడా కాలేయ ఆరోగ్యం తొందరగా పాడవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: