దీనికోసం ముందుగా 15 నుంచివరకు బాదంపప్పు, రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు,రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు,రెండు టేబుల్ స్పూన్ల పెసలు,అర టీ స్పూన్ పసుపువేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.ఇది నున్నటి పౌడర్ లాగా చేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే నెలరోజుల పాటు సోప్ లాగా వాడుకోవచ్చు.
ఈ పౌడర్ని వాడే కంటే ముందు పిల్లలకు బాదం ఆయిల్ తో బాగా మసాజ్ చేసి,అ తరువాత పైన చెప్పిన పొడిని సోప్ లాగా వంటికి మొత్తం పట్టించి,మెల్లగా మర్దన చేయాలి.ఇలా నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేయడంతో ఎంతటి నల్లగా ఉన్న పిల్లలైనా తొందరగా రంగు తేలుతారు.అంతేకాక ఇందులో వాడిన పప్పుల లోని ప్రోటీన్ పిల్లలు ఎదుగుదలకు తోడ్పడడమే కాకుండా,శరీరంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.బాదాంలో ఉన్న విటమిన్ ఈ శరీరం మాయిశ్చరైజంగా ఉండడానికి తోడ్పడి,పిల్లల బుగ్గలు పాలవలే ఉంటాయి.
మీరు కూడా మీ పిల్లలు ఇలాగే నల్లగా ఉన్నారని బాధపడుతూ ఉంటే ఈ చిట్కాని తప్పకుండా పాటించండి.దీనితో పాటు పిల్లలకు విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ కల ఆహారాలను ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా పిల్లలు ఆరోగ్యంగా,అందంగా, మెరుస్తూ ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. అంతేకాక పిల్లలను కచ్చితంగా సరైన మోతాదులో నీరు త్రాగించడం కూడా మన పనే.