షుగర్ వ్యాధితో బాధపడే వారు ఖచ్చితంగా జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు ఇంకా కొవ్వు తక్కువగా ఉండే పాలను తీసుకోవాలి. అలాగే వీటితో పాటు ప్రతి రోజూ ఉదయం పరగడుపున కొన్ని పానీయాలను తీసుకోవడం వల్ల రక్తంలో ఎల్లప్పుడూ చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవచ్చు. ఇక ఈ పానీయాలను తాగడం వల్ల షుగర్ అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఇప్పుడు షుగర్ ను అదుపులో ఉంచే పానీయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


షుగర్ వ్యాధి గ్రస్తులు ప్రతి రోజూ ఉదయం పూట ఒక గ్లాస్ నిమ్మకాయ నీటిని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది. ఇంకా అలాగే దాల్చిన చెక్కతో చేసిన టీని తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి ఈజీగా అదుపులో ఉంటుంది. దాల్చిన చెక్కను నీటిలో వేసి దానిని మరిగించి టీ లా చేసుకుని తీసుకోవచ్చు. లేదంటే మనం త్రాగే టీలో దాల్చిన చెక్క పొడిని వేసి కూడా తీసుకోవచ్చు. ఈ దాల్చిన చెక్కకు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణం ఉంది. అందువల్ల దాల్చిన చెక్కతో టీ తయారు చేసి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఈజీగా అదుపులో ఉంటుంది.


ఇక ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున సీతాఫలం జ్యూస్ ను తాగడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే మెంతి నీటిని తాగడం వల్ల కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా మేలు కలుగుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా కూడా నానబెట్టాలి. పొద్దున్నే ఈ నీటిని తాగి మెంతులను తినాలి.ఇలా చేయడం వల్ల  రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా అదే విధంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల  మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు షుగర్ కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే కలబంద జ్యూస్ ను తాగడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: