బెండకాయలో శరీరానికి పోషణను అందించే చాలా పోషక విలువలు ఉన్నాయి. వీటిలో ఫైబర్, విటమిన్-బి6, ఫోలేట్ వంటి పోషకాలు ఎంతో పుష్కలంగా ఉంటాయి.విటమిన్-బి అనేది శరీరంలో డయాబెటిక్ న్యూరోపతి అభివృద్ధిని నియంత్రిస్తుంది. ఇది శరీరంలో హోమోసిస్టీన్ స్థాయిని ఈజీగా తగ్గిస్తుంది. ఇక బెండకాయ నీటిలో కరిగే ఫైబర్ కలిగి ఉంటుంది. అలాగే ఇది శరీరంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.ఇక బెండకాయలో కేలరీలు చాలా తక్కువ. నీటిలో కరిగే, నీటిలో కరగని ఫైబర్ రెండింటికి చాలా మంచి మూలం.అందువల్ల శరీరంలోని పీచు మెల్లగా విచ్ఛిన్నమవుతుంది. దీని కారణంగా, రక్తంలో చక్కెర అనేది నెమ్మదిగా విడుదల అవుతుంది.దాని ఫలితంగా రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. బెండకాయ నీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా అదుపులో ఉంచుతాయి. ‘అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్’ ప్రకారం, డయాబెటిక్ రోగులకు బెండకాయ నీరు చాలా మంచిదట.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బెండకాయ వాటర్ అనేది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.


బెండకాయ నీటిని తయారు చేయడానికి, 5 నుంచి 6 బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి.వాటిని ముక్కలుగా కట్‌ చేసుకుని నీటిలో వేసి మూతపెట్టండి.. ఆ మరుసటి రోజు ఉదయం పూట పరగడుపునే బెండకాయ నీటిని వడకట్టుకోవాలి.ఆ తరువాత ఆ నీటిని తాగేయండి.మీరు క్రమం తప్పకుండా కొద్ది రోజులు ఈ నీటిని తాగడం వల్ల మీ ఒంట్లోని షుగర్ ఈజీగా మీ కంట్రోల్‌లో ఉంటుంది. బెండకాయలో ఇన్సులిన్ ప్రాపర్టీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చక్కర వ్యాధిని నియంత్రించడానికి బాగా తొడ్పడతాయి. నానబెట్టిన బెండకాయను తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇలా బెండకాయ నానబెట్టిన నీటిని తీసుకోవటం వల్ల దగ్గు ఇంకా గొంతు నొప్పులను దూరం చేస్తుంది. గొంతు వాపు, దగ్గు అలాగే గొంతులో దురద వంటి సమస్యలుంటే.. బెండకాయ నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.బెండకాయలో ఉండే యాంటీ సెఫ్టిక్ లక్షణాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంకా అతిసారాన్ని నియంత్రించడంలో కూడా బెండకాయ నానబెట్టిన నీరు చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: