ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న జీర్ణసమస్యలల్లో యాసిడ్ రిప్లెక్స్ కూడా ఒకటి. దీనిని జిఇఆర్డి లేదా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిప్లక్స్ వ్యాధి అని అంటారు.అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మనం తినే ఆహారాన్ని పొట్టలోకి చేర్చే నాళంలోకి కడుపులో ఉండే ఆమ్లాలు పదే పదే రావడాన్నే యాసిడ్ రిప్లెక్స్ అంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది ఖచ్చితంగా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ను మనం కొన్ని లక్షణాల ద్వారా గమనించవచ్చు.ఈ లక్షణాలు మనలో కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. యాసిడ్ రిప్లెక్స్ వల్ల మనలో కనిపించే లక్షణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


యాసిడ్ రిప్లెక్స్ వల్ల గుండెల్లో నొప్పి, మంట, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వారికి గుండె, ఛాతిలో చాలా అసౌకర్యంగా ఉంటుంది.ఇంకా అలాగే నోట్లో లాలాజలం కూడా ఎక్కువగా తయారవుతుంది. ఆహారం తిన్న తరువాత నోట్లో ఎక్కువగా లాలాజలం తయారైతే అది యాసిడ్ రిప్లెక్స్ గా భావించాలి.గొంతులో చికాకు, మంట వల్ల  లాలాజలం ఎక్కువగా తయారవుతుంది. ఇంకా అదే విధంగా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది.అయితే ఈ సమస్య రాత్రి ఎక్కువగా ఉంటుంది.ఇక పడుకున్న తరువాత గురక ఇంకా దగ్గు ఎక్కువగా వస్తుంది.ఇది కూడా యాసిడ్ రిప్లెక్స్ లో ఒక భాగమనే చెప్పాలి.ఇంకా అలాగే ఇది నోట్లో ఎల్లప్పుడూ చేదుగా, పుల్లగా ఉంటుంది.


అలాగే పుల్లటి త్రేన్పులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.ఈ యాసిడ్ రిప్లెక్స్ వల్ల కడుపులో ఎక్కువగా యాసిడ్ తయారవుతుంది. అందువల్ల కడుపులో నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడే వారి కడుపులో తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి ఇంకా పొత్తి కడుపులో వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. ఇక ఈ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: