కరివేపాకులలో ఆల్కలాయిడ్స్,గ్లైకోసైడ్లు మరియు ఫినోలిక్ వంటి సమ్మేళనాలు అధికంగా ఉంటాయి.ఈ సమ్మేళనాలు మానవ శరీరంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.అంతే కాక ఇందులో బీటా కెరొటీన్,విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తాయి.
గుండె ఆరోగ్యానికి..
కరివేపాకులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజుకు ఆరు చొప్పున తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుంది.ఇందులోని సుగుణాలు అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
మెదడు డెవలప్మెంట్ కోసం..
కరివేపాకు రోజూ తీసుకోవడంతో మన మెదడుతో సహా మొత్తం నాడీ వ్యవస్థను ఎటువంటి రోగాల బారిన పడకుండా కాపాడుతుంది.అంతేకాక ఈ ఆకులో ఉన్న శక్తివంతమైన పదార్థం అల్జీమర్స్ వంటి వ్యాధులను దారిచేరకుండా సహాయపడతాయి.మరీ ముఖ్యంగా పిల్లలకు కరివేపాకు తప్పకుండా తినిపించాలి.
అధిక బరువు తగ్గించుకోవడానికి..
ఈ ఆకులు కొవ్వును కరిగించడానికి ఇందులోని సుగుణాలు చాలా బాగా పనిచేస్తాయి.అంతే కాక మన శరీరం నుండి విషపూరిత మూలకాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.దానితో అధిక బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
డయాభేటీస్..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కరిఆకులను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ ఆకులను రోజుకు ఆరు చొప్పున తీసుకోవడంతో ఇందులోని సారం రక్తంలోని అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.అంతేకాక వేప ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
జుట్టు పెరుగుదలకు..
చిన్నతనం నుంచే కరివేపాకులు తినడం అలవాటు చేయడం వల్ల ఇందులోని బిటాకెరొటీన్ మరియు బీట కెరొటీన్ పుష్కళంగా అంది,జుట్టు ఒత్తుగా,దృఢంగా, మెరుగ్గా పెరుగుతుంది.కావున ప్రతి ఒక్కరూ రోజుకో ఆరు కరివేపాకులు తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.