![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/health-tips6398c996-e071-4386-acd2-8349f1131233-415x250.jpg)
ప్రతి రోజూ జాగింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. జాగింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి.ఇంకా అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. జాగింగ్ చేయడం వల్ల కండరాల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. కండరాలు చాలా ధృడంగా ఇంకా ఆరోగ్యంగా తయారవుతాయి.మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలా అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ప్రతి రోఊ జాగింగ్ చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం, అజీర్తి ఇంకా గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే నిద్రలేమి సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ విధంగా ప్రతి రోజూ 20 నిమిషాల పాటు జాగింగ్ చేడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి రోజూ జాగింగ్ తప్పకుండా చేయాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.