మన నరాలపై ఒత్తిడి పడడం వల్ల ఇలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.ఈ తిమ్మిర్లు రావడం చాలా సహజం. ఇలా వచ్చిన తిమ్మిర్లు కొద్ది సమయం తరువాత వాటంతట అవే తరువాత తగ్గిపోతాయి. కానీ కొందరిలో మాత్రం ఈ తిమ్మిర్లు తరుచూ వస్తూ ఉంటాయి. కాళ్లు, చేతులతో పాటు అరికాళ్లు, అరి చేతుల్లో కూడా ఈ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇంకా రోజుల తరబడి తిమ్మిర్లు వస్తూనే ఉంటాయి. ఇలా తరుచూ వచ్చే తిమ్మిర్లను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరుచూ తిమ్మిర్లు రావడానికి వెనుక చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తరుచూ తిమ్మిర్లు వస్తూ ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనూ వైద్యున్ని సంప్రదించి అందుకు తగిన చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక తరుచూ తిమ్మిర్లు రావడానికి గల కారణాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ తిమ్మిర్లు రావడానికి గల ముఖ్యమైన కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ తిమ్మిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రక్తంలో ఎక్కువగా ఉండే చక్కెరలు నరాల ఆరోగ్యాన్ని ఈజీగా దెబ్బతీస్తాయి. అందువల్ల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.


ఇంకా అలాగే వెన్నెముకలో జారిన డిస్క్ కాళ్ల నరాలపై ఒత్తిడి చేయడం వల్ల కూడా తిమ్మిర్లు ఎక్కువగా వస్తాయి. ఇంకా అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, ల్యూపస్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో కూడా ఈ తిమ్మిర్లు ఎక్కువగా వస్తాయి. ఇంకా అంతేకాకుండా శరీరంలో విటమిన్ బి, విటమిన్ ఇ లు లోపించడం వల్ల కూడా ఈ తిమ్మిర్లు వస్తాయి. ఇంకా అలాగే హెపటైటిస్ డి, సి వంటి ఇన్పెక్షన్ లతో బాధపడే వారిలో కూడా నరాల ఆరోగ్యం దెబ్బతిని తిమ్మిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి.అదే విధంగా మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలొ ఇంకా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో కూడా తిమ్మిర్లు ఎక్కువగా వస్తాయి. ఇంకా అలాగే వివిధ రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారిలో కూడా ఈ తిమ్మిర్లు తరుచూ వస్తూ ఉంటాయి. ఈ విధంగా తరుచూ తిమ్మిర్లు రావడం వెనుక చాలా కారణాలు ఉంటాయని తరుచూ తిమ్మిర్లు వస్తూ ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: