సాధారణంగా చాలామందికి రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు కానీ,పగలు మాత్రం తిన్న వెంటనే నిద్ర మజ్జుగా అనిపిస్తూ ఉంటుంది.ఇంట్లో ఉన్నవారికి అయితే సరిపోతుంది కానీ,ఉద్యోగాలు చేసే వారికి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది.పది నిమిషాలు వారిని వదిలేస్తే చాలా హాయిగా ఉంటుందని కూడా ఫీల్ అవుతూ ఉంటారు.కానీ అలాంటి వెసులు బాటు లేక నిద్రను ఆపుకుని ఆపుకొని వారికి తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలా రావడానికి కారణం కొన్ని రకాల కారణాలు దోహదపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారా అయితే ఆ సమస్యల కారణాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

కావలసిన దాని కన్నా అతిగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల,పొట్టలోని కండరాలు జీర్ణం కావడానికి బాడీకి కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలని అనుకుంటుంది.అప్పుడే మనము తిన్న ఆహారంలోని శక్తి,గ్లూకోజ్ గా మారి, రక్తంలోకి కలుస్తుంది.ఆ సమయంలోనే మత్తుగా అనిపించి నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది.కావున మీరు కూడా ఇలా అతిగా తినకుండా,తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి.

కానీ కొంతమంది మంది స్త్రీలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మొదటగా అనిపించడం అనుభవించడానికి హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్,రక్తహీనత స్ట్రెస్,పని భారం రాత్రిళ్ళు నిద్ర లేకపోవడం వంటి కారణాలుగా చెబుతున్నారు పరిశోధకులు.

లంచ్ తర్వాత ఒక పవర్ న్యాప్ వేయడం వల్ల చాలా ఎనర్జీటిక్ గా మారుతారని పరిశోదకులు చెబుతున్నారు.ఇలా నిద్రపోవడం వల్ల వర్క్ విషయంలో కూడా చాలా ప్రభావితంగా పని చేస్తుందని చెబుతున్నారు.ప్రతి ఒక్కరికి ఈ పవర్ న్యాప్‌ చాలా అవసరం.దీని వల్ల మధుమేహం,థైరాయిడ్,జీర్ణవ్యవస్థ సమస్య,ఫుడ్ అలర్జీ,నిద్రలేమి,రక్తహీనత వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.కొన్ని కంపెనీలు కూడా ఈ వేసలు బాటు కల్పించి,ఉత్పధాకతను పెంచుకుంటున్నాయి.

కానీ ఈ పవర్ నాకు మాత్రం అరగంటనే ఉండాలి.ఈ నిద్ర రెండు మూడు గంటలసేపు ఉంటే మాత్రం చాలా బతకానికి దారితీస్తుంది.కావున ప్రతి ఒక్కరూ అరగంట సేపు మధ్యాహ్నం పూట నిద్రపోవడం కూడా చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: