సాధారణంగా చాలామందికి సైనిటిస్తూ ఓన్లీ హెడేక్ వస్తుందని మాత్రమే తెలుసు కానీ,చాలా లక్షణాలు కనిపిస్తాయని మాత్రం అసలు తెలియదు.కానీ కొన్ని రకాల లక్షణాలు మనకు కొన్ని రకాల లక్షణాలు కనిపించిన అస్సలు గుర్తుపట్టలేము.ఇలా ఏమి కాదులే అని వదిలేస్తే మాత్రం చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.మరి అవేంటో,వాటిని తీవ్రతరం కాకుండా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం పదండీ..

సైనటైటీస్ లో భాగంగా తలనొప్పి,తలంతా బరువుగా ఉండుట,ముఖంలో వాపు,నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద,ముక్కు నుండి నీరు కారడం,గొంతులోకి స్ట్రావాలు కారడం,దగ్గు,జలుబు,జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయ.

ఇంకా చెప్పాలంటే చల్లని పదార్థాలను తిన్నా, చల్ల గాలికి వున్నా వెంటనే ఇన్ఫెక్షన్లు,అలెర్జీలు సైనస్‌లలో ఒత్తిడిని తెస్తాయి.ఇది ఇలానే కొనసాగితే ఊపిరితిత్తులు నెమ్ము ఎక్కడం,శ్వాస కోశ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముక్కు ని ప్రతి రెండు, మూడు గంటలకొకసారి క్లియర్ చేసుకుంటే, సైనసైటిస్‌ లక్షణాలను తొందరగా ఉపాశమానం కలిగించుకోవచ్చు.దానితో పాటు కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సైనస్‌ పెట్టే బాధ నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చల్లని పదార్థాలకు దూరంగా ఉండటం..

ఈ సమస్యతో బాధపడేవారు కచ్చితంగా చల్లని వస్తువులను అంటే పెరుగు,ఐస్ క్రీమ్,మజ్జిగ,జ్యూస్ చెరుకు రసం,కొబ్బరి పాలు వంటి పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి.లేదంటే ఇవి సైనస్ ప్రాబ్లంని మరింత పెంచే అవకాశం ఉంటుంది.

వేడి కాపడం..

సైనస్‌ నొప్పి ఎక్కువగా ఉంటే  గోరువెచ్చని నీటిని తీసుకొని టవల్‌ ముంచి,ముక్కు మరియు బగ్గులనకు కాపడం పెట్టాలి.ఇలా చేయడంతో వెంటనే రిలీఫ్‌ కలుగుతుంది.అంతే కాక సైనసైటిస్‌ నొప్పి,ఒత్తిడిని కూడా తొలగిస్తుంది.

ఆవిరి పట్టడం..

ముక్కుదిబ్బడ ముక్కు నుంచి నీరు కారడం,తలనొప్పి బుగ్గ నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు వేడివేడినీటిలో ఏజెన్షియల్ ఆయిల్ కానీ,యూకలిప్టస్ ఆయిల్ కానీ వేసి కొద్దిసేపు ఆవిరి పెట్టడం వల్ల,ఆ సమస్యలకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.

విశ్రాంతి తీసుకోవడం..

సైనస్ ప్రాబ్లమ్స్ ఏ ఒక్కటి కనిపించినా తొందరగా ఉపశమనం కలగాలి అంటే,కచ్చితంగా బాడీకి రెస్ట్ ఇవ్వాలి.

హైడ్రేటెడ్ గా ఉండడం..

సైనస్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి నీటిని అధికంగా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.దీనివల్ల శరీరం హైడ్రెటెడ్ గా ఉండి తలనొప్పి,అధిక వేడి వంటి సమస్యలు తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: