పచ్చిమిర్చిలలో ఫైబర్ కంటెంట్ చాలా పుష్కలంగా ఉంటుంది. తద్వారా జీర్ణక్రియ కూడా చాలా సులభంగా పనిచేస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సైతం పచ్చిమిర్చి క్యాలరీ లేని ఆహారమని చెప్పవచ్చు.. ఇది బరువు తగ్గించే ప్రక్రియలో కూడా చాలా ఉపయోగపడుతుంది.. ఇందులో బీటా కెరటం కూడా అధికంగా ఉండడం వల్ల గుండె వ్యవస్థను కూడా సక్రమంగా పనిచేసేలా సహాయపడుతున్నది. రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా చాలా సహాయపడుతుంది. పచ్చిమిర్చి లో కొన్ని సహజమైన పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సైతం తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఎర్రమిరపకాయలు లేదా కారంపొడిని ఉపయోగించేందుకు మక్కువగా చూపిస్తూ ఉంటారు. అయితే పచ్చిమిర్చి ఎండిపోవడంతో ఎర్రగా మారుతుంది .దీనిని కూడా ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తారు . దీనివల్ల కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఎర్ర మిరపకాయలలో ఎక్కువగా క్యాప్సిస్ అనే సమ్మేళనం ఉంటుందట. ఇది శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది. ఎండుమిరపకాయలు సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. దీంతో మెదడు మానసిక స్థితిని సైతం నిర్వహించడానికి సహాయపడతాయి. పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల ఎర్ర మిరపకాయలు రక్తపోటుని తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎర్ర మిరపకాయలను ఆహారంలో అప్పుడప్పుడు చేర్చుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం వంటివి తగ్గుతుంది.
ఎర్ర మిర్చి రెడ్ మిర్చి వల్ల ఏదాని ప్రయోజనాలు అవి కలిగి ఉంటాయి. అయితే కేవలం మనం చేసే వాటిపైనే ఆధారపడి ఉంటుంది.